Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలోని కానిస్టేబుళ్ల సరెండర్ లీవ్‌ల బకాయిలు చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు సరెండర్, అడిషనల్ సరెండర్ లీవ్ బెనిఫిట్ కింద అందించే డబ్బులు కొన్ని జిల్లాలకు మాత్రమే అందించి మరికొన్ని జిల్లాలకు అందించకపోవడం బాధాకరమని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోని దాదాపు 6వేల మంది కానిస్టేబుల్స్‌కు సరెండర్, అడిషనల్ సరెండర్ లీవ్ బెనిఫిట్ గత ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో పెట్టారు. పెట్రోల్, డీజిల్ బిల్లులు కూడా నెలల తరబడి రాక పోలీసులు, పెట్రోల్ బంక్ వారు కూడా ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌రావు తెలిపారు.
వీరి పట్ల ఎందుకు ఇంత వివక్ష.? రాష్ట్ర పోలీసులలో వీళ్ళు భాగం కాదా..? ఒకే డిపార్ట్మెంట్లో ఇంత పక్షపాతం ఎందుకు..? ఇది వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే.. యూనిఫామ్ సర్వీస్ వాళ్లు కాబట్టి వాళ్లు బయటకు రాలేకపోతున్నారు. వాళ్ళ సమస్యను నేను మీ దృష్టికి తెస్తున్నాను తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
గౌరవ ఉప ముఖ్యమంత్రి
@Bhatti_Mallu గారికి,రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు సరెండర్ మరియు అడిషనల్ సరెండర్ లీవ్ బెనిఫిట్ కింద అందించే డబ్బులు కొన్ని జిల్లాలకు మాత్రమే అందించి మరికొన్ని జిల్లాలకు అందించకపోవడం బాధాకరం రాష్ట్రంలోని కామారెడ్డి, నిజామాబాద్, మెదక్,సంగారెడ్డి…
— Harish Rao Thanneeru (@BRSHarish) August 21, 2024
ఇవి కూడా చదవండి..
KTR | నాకంటూ ఎలాంటి ఫామ్ హౌజ్ లేదు.. తప్పుంటే దగ్గరుండి నేనే కూలగొట్టిస్తా : కేటీఆర్
Janwada form house | జన్వాడ ఫామ్‌హౌస్‌ను కూల్చవద్దు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు
Cobra | వాషింగ్ మెషీన్లో నాగుపాము ప్రత్యక్షం.. షాకింగ్ వీడియో