Janwada farm house : జన్వాడ ఫామ్‌హౌస్‌ను కూల్చవద్దంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫామ్‌హౌస్ యజమాని ప్రదీప్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, శంకర్పల్లి తహసీల్దార్, చీఫ్ ఇంజినీర్‌ను చేర్చారు. తన ఫామ్‌హౌస్, పొలము ఉస్మాన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో లేవని పిటిషనర్ పేర్కొన్నారు.
‘ఈ నెల 14న నా ఫామ్‌హౌస్‌ను నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారు. ఎఫ్టీఎల్ పరిధిలో నా ఫామ్‌హౌస్ లేదని ఆధారాలు చూపించాను. ఎఫ్టీఎల్ పరిధిలోనే నిర్మాణం ఉందని అధికారులు వాదించారు. 2019లో నేను ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశాను. రాజకీయ కారణాలతో ఇప్పుడు నా ఆస్తికి నష్టం చేయాలని చూస్తున్నారు’ అని ప్రదీప్‌రెడ్డి తన పిటిషన్ ద్వారా కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది.