KTR | హైదరాబాద్ : బఫర్ జోన్‌లోని కానీ, ఎఫ్టీఎల్లో కానీ తనకంటూ ఎలాంటి ఫామ్ హౌజ్ లేదు.. మీరు చెప్తున్న ఆ ఫామ్ హౌజ్ తన స్నేహితుడిది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
తన స్నేహితుడి ఫామ్ హౌజ్ ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లో ఉంటే నేనే దగ్గర్నుండి కూలగొట్టిస్తా. నో ప్రాబ్లం.. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సిందే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాను. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలు కట్టిన రాజభవనాల సంగతి ఏంది..? నా స్నేహితుడి ఫామ్ హౌజ్‌ను మరి జూమ్లు పెట్టి తీస్తున్నారు.. అవి సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. కానీ చెరువుల్లో కట్టుకున్న మంత్రుల ఫామ్ హౌజ్‌ల సంగతి ఏంది..? చెరువుల్లో కట్టుకున్న బడా కాంగ్రెస్ నాయకుల ఫామ్ హజ్లు కూలగొట్టే దమ్ము హైడ్రాకు లేదా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఎఫ్టీఎల్ పరిధిలో కట్టుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మధు యాష్కీ వీళ్ళందరి ఫామ్ హౌజ్‌ల దగ్గరికి వెళ్ళి కూలగొడదాం. వీరితో పాటు రేవంత్ రెడ్డిది కూడా ఫామ్ హౌస్ ఉంది. సీఎం ఫామ్ హౌజ్ గురించి శాటిలైట్ మ్యాప్‌లను కూడా మీడియాకు పంపిస్తాను చూసుకోండి. నా పేరు మీద ఫామ్ హౌజ్ం ఉన్నట్లు మీడియాలో ఏవేవో కథనాలు రాస్తున్నారు. కానీ స్పష్టంగా చెబుతున్నా.. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు. నేను లీజు మీద ఉన్నాను. ఒక వేళ తప్పు జరిగితే.. దగ్గరుండి కూల్చివేయించేందుకు సహకరిస్తాను. ఇక హైడ్రానో.. అమీబానో ఉంది కదా.. దాని తీసుకొని అక్కడ్నుంచి నేరుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నుంచి మొదలు పెడుదాం. వాళ్ల తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు. అన్నీ ఒక్కటే రోజు కూలగొడుదాం.. ప్రజలకు పారదర్శకంగా ఉందాం. ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా నాకు ఎలాంటి ఇబ్బంది, అభ్యంతరం లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | రేపటి రైతుల ధర్నాలు మొదటి అడుగు మాత్రమే.. రుణమాఫీపై కేటీఆర్
Janwada form house | జన్వాడ ఫామ్‌హౌస్‌ను కూల్చవద్దు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు
Bharath bandh | ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్.. నిలిచి పోయిన ఆర్టీసీ బస్సులు