హైదరాబాద్ : భారత్ బంద్కు(Bharath bandh) మద్దతుగా రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్ల వద్ద మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ(SC classification) వ్యతిరేక పోరాట సమితి నేతలు ఆందోళనలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదుట బైఠాయించారు. ఎస్సీ వర్గీకరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని దళిత నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాగా, ఎస్సీలలో ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజార్టీతో ఈ తీర్పు చెప్పింది. ధర్మాసనంలోని ఆరుగురు న్యాయమూర్తులు ఈ వర్గీకరణను సమర్థించగా, ఒకరు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నో ఏండ్లుగా వర్గీరణ కోసం పోరాడుతున్న సమస్యకు పరిష్కారం చూపినట్లుయింది.
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్.. నిలిచి పోయిన ఆర్టీసీ బస్సులు
భారత్ బంద్కు మద్దతుగా రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్ల వద్ద మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు ఆందోళనలు చేపట్టారు.
ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా… pic.twitter.com/qJeo9ehgcB
— Telugu Scribe (@TeluguScribe) August 21, 2024