Cobra | రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota) లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లోని వాషింగ్ మెషీన్ (Washing Machine)లో 5 అడుగుల కోబ్రా (Cobra) బుసలు కొడుతూ దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
శంభుదయాళ్ కుటుంబం స్వామి వివేకానంద నగర్లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో శంభుదయాళ్ బట్టలు లాండ్రీకి వేసేందుకు ఇంట్లోని వాషింగ్ మెషీన్‌ను తెరిచాడు. అంతే, అందులో 5 అడుగుల పొడవైన నాగుపాము ప్రత్యక్షమైంది. అది పడగవిప్పి బుసలు కొడుతూ దర్శనమిచ్చింది. ఇది చూసిన శంభుదయాళ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఇంటికి సమీపంలోని పాములు పట్టే వ్యక్తి గోవింద్ శర్మకు సమాచారం అందించాడు.
ఘటనాస్థలికి చేరుకున్న గోవింద్ శర్మ.. వాషింగ్ మెషీన్‌లోని పామును పరిశీలించాడు. అతికష్టం మీద దాన్ని సురక్షితంగా పట్టుకున్నాడు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టాడు. వాషింగ్ మెషీన్లో పాము బుసలు కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#Kota– स्वामी विवेकानंदनगर में कपड़े धोने के दौरान वाशिंग मशीन में कोबरा नज़र आने से हड़कंप मच गया.#Snake #Cobra #Washingmachine #viralvideo #Trending #trendingvideo pic.twitter.com/iI02bZXBGj
— विभोर अग्रवाल🇮🇳 (@IVibhorAggarwal) August 21, 2024
Also Read..
Central Force | ఆర్జీ కార్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర బలగాలు.. భద్రతా ఏర్పాట్ల పరిశీలన
Manu Bhaker | చెన్నైలో మను బాకర్ సందడి.. విద్యార్థులతో కలిసి ‘కాలా చష్మా’ అంటూ డ్యాన్స్.. VIDEO
Committee Kurrollu | కమిటీ కుర్రాళ్లు పవన్‌కల్యాణ్‌ను మీట్ అవుతున్నారా?