Manu Bhaker | పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024)లో భారత షూటర్ మను బాకర్ (Manu Bhaker) అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. రెండు కాంస్య పతకాలు సాధించి ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఈ యువ షూటర్ తాజాగా చెన్నై (Chennai)లో సందడి చేసింది. ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైంది. అక్కడ విద్యార్థులతో కలిసి స్టేజ్‌పై కాలుకదిపింది. హిందీ పాట ‘కాలా చష్మా’కు (kala chashma Song) ఉత్సాహంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా, పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో మను బాకర్ రెండు పతకాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రెండు సార్లూ కాంస్య పతకాన్ని ముద్దాడింది. అయితే, ఈ విశ్వ క్రీడల్లో హ్యాట్రిక్ మెడల్స్ కొట్టే అవకాశాన్ని మను చేజార్చుకుంది. ఈవెంట్లో టాప్ ఫామ్‌లో ఉన్న ఆ షూటర్.. 25మీటర్ల పిస్తోల్ ఈవెంట్లో తృటిలో కాంస్య పతకాన్ని మిస్ చేసుకుంది. దీంతో రెండు పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండు పతకాలతోపాటు ఎన్నో రికార్డులను కూడా తన పేరిట లిఖించుకుని భారత్ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది.
#WATCH | Tamil Nadu: Indian Shooter & double Olympic medalist Manu Bhaker shakes a leg during the launch of Velammal’s Vision for Olympic medal 2032 in Chennai. (20.08) pic.twitter.com/jF9eF4d60S
— ANI (@ANI) August 21, 2024
Also Read..
Badlapur | బద్లాపూర్ ఘటన.. 300 మంది నిరసనకారులపై ఎఫ్ఐఆర్ నమోదు
Bus Overturns | ఇరాన్లో బస్సు బోల్తా.. 28 మంది పాకిస్థాన్ యాత్రికులు మృతి