Bus Overturns | ఇరాన్లో బస్సు బోల్తా.. 28 మంది పాకిస్థాన్ యాత్రికులు మృతి
Bus Overturns | ఇరాన్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ నుంచి యాత్రికులతో (Pakistani pilgrims) వెళ్తున్న బస్సు బోల్తా పడింది (Bus Overturns).
Bus Overturns | ఇరాన్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ నుంచి యాత్రికులతో (Pakistani pilgrims) వెళ్తున్న బస్సు బోల్తా పడింది (Bus Overturns). ఈ ఘటనలో సుమారు 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
పాకిస్థాన్‌లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో గల లర్కానా నగరానికి చెందిన సుమారు 53 మంది ఇరాన్‌కు షియా యాత్రకు బయల్దేరి వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు సెంట్రల్ ఇరాన్ ప్రావిన్స్ యాజ్డ్ (Yazd)లో మంగళవారం రాత్రి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 28 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారిని ఊటంకిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ నివేదించింది. మరో 23 మంది గాయపడినట్లు పేర్కొంది. బస్సు బ్రేకింగ్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నట్లు తెలిపింది.
‘దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో 11 మంది మహిళలు, 17 మంది పురుషులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆరుగురు వ్యక్తులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు’ స్థానిక అధికారులు తెలిపారు. కాగా, ప్రస్తుతం ఇరాన్‌లోని కర్బలా గవర్నరేట్‌లో లక్షలాది మంది షియా ముస్లింలు అర్బయిన్ తీర్థయాత్రలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే పలు దేశాల నుంచి యాత్రికులు అర్బయిన్ తీర్థయాత్ర కోసం ఇరాక్‌కు వెళుతున్నారు.
Also Read..
Road Accident | కారును ఢీ కొట్టిన ట్రక్కు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ISRO | వచ్చే ఐదేళ్లలో 70 ఉపగ్రహాలను ప్రయోగిస్తాం : ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్
Polygraph Test: ఆర్జీ కార్ ఆస్పత్రి ప్రిన్సిపాల్‌కు పాలీగ్రాఫ్ పరీక్ష !
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

