ISRO | వచ్చే ఐదేళ్లలో 70 ఉపగ్రహాలను ప్రయోగిస్తాం : ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్
ISRO | రాబోయే ఐదేళ్లలో 70 ఉపగ్రహాలను ప్రయోగించే యోచనలో ఉన్నామని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చైర్మన్ డాక్టర్ ఎస్ సోమ్‌నాథ్ వెల్లడించారు. ఇందులో చంద్రయాన్-4, చంద్రయాన్-5 మిషన్స్ సైతం ఉన్నాయని తెలిపారు.
ISRO | రాబోయే ఐదేళ్లలో 70 ఉపగ్రహాలను ప్రయోగించే యోచనలో ఉన్నామని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చైర్మన్ డాక్టర్ ఎస్ సోమ్‌నాథ్ వెల్లడించారు. ఇందులో చంద్రయాన్-4, చంద్రయాన్-5 మిషన్స్ సైతం ఉన్నాయని తెలిపారు. వీటి డిజైన్ ఇప్పటికే సిద్ధమైందని.. కేంద్రం అనుమతి కోసం చేస్తున్నామన్నారు. చంద్రయాన్-4లో చంద్రుడి ఉపరితలంపై నుంచి రాళ్లు, మట్టి నమూనాలను తీసుకురానున్నట్లు తెలిపారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ మిషన్‌లో స్పేస్ డాకింగ్ ఓ భాగమని వివరించారు. మిషన్‌లో పలు దశల్లో రాకెట్ల పలు భాగాలను నింగిలోకి పంపి.. ఆ తర్వాత వాటిని స్పేస్‌లోనే జతచేస్తారు.
ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌కు చెందిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా డాక్టర్ సోమనాథ్ మీడియాతో మాట్లాడారు. చంద్రయాన్-3 తర్వాత చంద్రుడిపైకి ఎన్నో మిషన్లు చేపట్టనున్నట్లు తెలిపారు. 2028లో చంద్రయాన్-4ని ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో ఇస్రో ప్రయోగించనున్న 70 ఉపగ్రహాల్లో దిగువ కక్ష్యలో ఉంచే ఉపగ్రహాలు ఉన్నాయన్నారు. నాలుగు ఉపగ్రహాలు ప్రాంతీయ నావిగేషన్ సిస్టమ్‌వి సైతం ఉంటాయని తెలిపారు. పది కంపెనీలు చిన్న శాటిలైట్ లాంచ్ వెహికల్స్ (SSLV) నిర్మాణంలో ఆసక్తిని కనబరిచాయన్నారు. ఇందులో కొన్ని సాంకేతికత బదిలీకి బిడ్డర్లుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. రెండేళ్ల వ్యవధిలో ఇస్రో సహాయంతో రెండు ఎస్ఎస్ఎల్వీలను అభివృద్ధి చేస్తారని, ఆపై చిన్న ఉపగ్రహాలను తక్కువ భూమి కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి రాకెట్‌ను రూపొందించే పనిలో నిమగ్నమవుతారని ఇస్రో చీఫ్ వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

