Road Accident | ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. కారును ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుమారు నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటావా (Etawah) జిల్లాలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్డిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారును ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులు ఢిల్లీ నుంచి హమీర్పిర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు చెప్పారు. అదేవిధంగా క్షతగాత్రులను చికిత్స కోసం తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Rishab Shetty | బాలీవుడ్ చిత్రాలు భారత్‌ను తక్కువ చేసి చూపిస్తున్నాయ్ : రిషబ్ శెట్టి
Spurthi Reddy | ఏసీబీ అధికారులకు చుక్కలు చూపించిన జలమండలి మేనేజర్ స్పూర్తిరెడ్డి..!
Polygraph Test: ఆర్జీ కార్ ఆస్పత్రి ప్రిన్సిపాల్‌కు పాలీగ్రాఫ్ పరీక్ష !