Spoorthy Reddy | ఏసీబీ అధికారులకు చుక్కలు చూపించిన జలమండలి మేనేజర్ స్పూర్తిరెడ్డి..!
Spoorthy Reddy | నల్లా కనెక్షన్ కోసం లంచం తీసుకుంటూ పట్టుబడిన మణికొండ జలమండలి మేనేజర్ స్పూర్తిరెడ్డిని అధికారులు అరెస్టు చేశారు. కొత్త నల్లా కనెక్షన్ కోసం రూ.30వేలు లంచం తీసుకుంటుండగా మేనేజర్‌ను పట్టుకున్నారు.
Spoorthy Reddy | నల్లా కనెక్షన్ కోసం లంచం తీసుకుంటూ పట్టుబడిన మణికొండ జలమండలి మేనేజర్ స్పూర్తిరెడ్డిని అధికారులు అరెస్టు చేశారు. కొత్త నల్లా కనెక్షన్ కోసం రూ.30వేలు లంచం తీసుకుంటుండగా మేనేజర్‌ను పట్టుకున్నారు. ఆ తర్వాత అధికారులు పుప్పాల్‌గూడలోని మేనేజర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అక్రమ ఆస్తులను గుర్తించారు. స్పూర్తిరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అధికారులు వల వేసి పట్టుకున్నారు. అయితే, సోదాలకు వెళ్లే సమయంలో ఏసీబీ అధికారులకే ఆమె చుక్కలు చూపించారు. దాదాపు రెండుగంటల పాటు తాను ఉంటున్న ఇంటి అడ్రస్‌ను చెప్పలేదు. తప్పుడు అడ్రస్‌లు చెబుతూ అధికారులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు.
చివరకు అధికారులు ఇంటి అడ్రస్‌ను తెలుసుకొని వెళ్లారు. అనంతరం సోదాలు నిర్వహించగా అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన బొమ్మ ఉపేంద్రనాథ్‌రెడ్డి కొత్తగా భవనాన్ని నిర్మించుకున్నారు. భవనం కోసం రెండు కొత్త నీటి కనెక్షన్లు తీసుకునేందుకు అధికారులను ఆశ్రయించాడు. దీంతో మేనేజర్ స్పూర్తిరెడ్డి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌గౌడ్ ద్వారా సదరు వ్యక్తి నుంచి రూ.30వేలు లంచం డిమాండ్ చేశారు. అన్ని దస్తావేజులు సరిగ్గా ఉన్నా కనెక్షన్ ఎందుకు ఇవ్వరని బాధితుడు ప్రశ్నించాడు. డబ్బులు ఇస్తేనే కనెక్షన్ అనుమతి ఇస్తామని చెప్పడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం జలమండలి మేనేజర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

