Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, ప్రముఖ తెలంగాణవాది కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ అరెస్టు తెలంగాణలో పెచ్చుమీరుతున్న నిరంకుశత్వానికి స్పష్టమైన సంకేతం అని ఆయన తెలిపారు. ఈ మేరకు హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులను సోషల్ మీడియాలో దిలీప్ కొణతం ఎత్తి చూపుతున్నారు. ఈ క్రమంలో దిలీప్‌ను రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. గత ఆరు నెలల నుంచి దిలీప్‌ను పోలీసులు వేధిస్తూనే ఉన్నారు. గతంలోనే ఒక అక్రమ కేసు పెడితే… రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. దిలీప్‌ను అరెస్టు చేయొద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇవాళ ఎలాంటి కారణం చెప్పకుండా ఆయనను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు ఉన్నాయి… మమ్మల్ని ఏ వివరాలు అడగొద్దని పోలీసులు చెప్పారు. కేసు ఎఫ్ఐఆర్ వంటి అంశాలపై పోలీసులు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.
ఈ క్రమంలో బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయానికి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పటోళ్ల కార్తీక్ రెడ్డి, మన్నె క్రిశాంక్, సతీశ్ రెడ్డి, వాసుదేవా రెడ్డితో పాటు పలువురు నాయకులు వచ్చారు. దిలీప్‌ను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని వారు పోలీసులను అడిగారు.
I strongly condemn the illegal arrest of Dileep Konatham, a clear sign of rising authoritarianism in Telangana. https://t.co/64hydfccdw
— Harish Rao Thanneeru (@BRSHarish) September 5, 2024
ఇవి కూడా చదవండి..
Konatham Dileep | రేవంత్ సర్కార్ మరో దౌర్జన్యకాండ.. కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్
Konatham Dileep | కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్.. సీసీఎస్ కార్యాలయానికి బీఆర్ఎస్ నేతలు