Konatham Dileep | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి సర్కార్ మరో దౌర్జన్యకాండకు పాల్పడింది. మాజీ డిజిటల్ డైరెక్టర్, తెలంగాణవాది కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులను సోషల్ మీడియాలో దిలీప్ కొణతం ఎత్తి చూపుతున్నారు. ఈ క్రమంలో దిలీప్‌ను రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. గత ఆరు నెలల నుంచి దిలీప్‌ను పోలీసులు వేధిస్తూనే ఉన్నారు.
గతంలోనే ఒక అక్రమ కేసు పెడితే… రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. దిలీప్‌ను అరెస్టు చేయొద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇవాళ ఎలాంటి కారణం చెప్పకుండా ఆయనను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు ఉన్నాయి… మమ్మల్ని ఏ వివరాలు అడగొద్దని పోలీసులు చెప్పారు. కేసు ఎఫ్ఐఆర్ వంటి అంశాలపై పోలీసులు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.
కాంగ్రెస్ సర్కారు, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన పేరుతో ఖాకీ దౌర్జన్యమేంటని మండిపడుతున్నారు. అక్రమం అదుపులోకి తీసుకున్న కొణతం దిలీప్‌ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నేతలు, పలువురు మేధావులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Sabitha Indra Reddy | మీరు కేసీఆర్ సార్‌తోనే ఉండండి.. సబితక్కకు ఓ యువకుడి రిక్వెస్ట్.. వీడియో
TG Rains | బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇక తెలంగాణలో ఐదురోజులు భారీ వానలే..!