Konatham Dileep | హైదరాబాద్ : తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, ప్రముఖ తెలంగాణవాది కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దిలీప్ అక్రమ అరెస్టును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. అసలు దిలీప్‌ను ఎందుకు అరెస్టు చేశారు..? ఏ కేసులో అరెస్టు చేయాల్సి వచ్చిందో చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయానికి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పటోళ్ల కార్తీక్ రెడ్డి, మన్నె క్రిశాంక్, సతీశ్ రెడ్డి, వాసుదేవా రెడ్డితో పాటు పలువురు నాయకులు వచ్చారు. దిలీప్‌ను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని వారు పోలీసులను అడిగారు.
బీఆర్ఎస్ నేతలు సీసీఎస్ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వీడియోలు తీస్తున్న ఓ కెమెరామెన్ ఫోన్‌ను పోలీసులు దౌర్జన్యంగా లాక్కున్నారు. మీడియా ప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.
ప్రముఖ తెలంగాణ వాది దిలీప్ కొణతం అరెస్టును తీవ్రంగా ఖండించిన బిఆర్ఎస్ పార్టీ
బషీర్‌బాగ్ లోని సిసిఎస్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కార్తీక్ రెడ్డి మరియు పలువురు పార్టీ సీనియర్… pic.twitter.com/5VrXsNl16J
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2024
ఇవి కూడా చదవండి..
Konatham Dileep | రేవంత్ సర్కార్ మరో దౌర్జన్యకాండ.. కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్
Jagadish Reddy | అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతులను అడ్డుకోలేరు : జగదీష్ రెడ్డి