Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలోని రైతాంగానికి రుణమాఫీ పూర్తి చేశాను అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.. ఒక వేళ నిజంగానే రుణమాఫీ జరిగితే.. రుణమాఫీపై చర్చకు సిద్ధమా..? నీ కొండారెడ్డిపల్లికే పోదాం పదా..! అక్కడే చర్చ పెట్టి తేలుద్దాం అని రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రుణమాఫీ పూర్తి చేశాను అని రేవంత్ రెడ్డి అంటున్నారు. రుణమాఫీ నిజంగా జరిగిందా.. దేవుడు మీద ఒట్టు పెట్టి ఏం మాట్లాడావు.. అటున్న సూర్యుడు ఇటు పొడిచినా.. ఎవడున్న లేకపోయినా పంద్రాగస్టు నాటికి రుణమాఫీ చేస్తా అన్నావ్. అయిందా రుణమాఫీ..? ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నవ్. ఏ ఊరికి పోదాం.. నీ కొండారెడ్డిపల్లికి పోదాం పదా.. డేట్, టైమ్ చెప్పు నేను వస్తా.. రైతులకు రుణమాఫీ అయిందా అని నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలో అడుగుదాం పదా.. అని రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్ చేశారు.
రుణమాఫీ కానీ వారి వివరాలను నా నియోజకవర్గంలో తయారు చేయించా..? సర్వే చేయించాను.. సిద్దిపేట రూరల్ మండలం వెకంటాపూర్ గ్రామం.. ఆ గ్రామంలో ఇప్పటి వరకు 122 మందికి రుణమాఫీ అయింది. ఇంకా 82 మందికి కాలేదు. ఇందులో జరిగిన రుణమాఫీ కోటి 13 లక్షల 74 వేల 552 రూపాయాలు. ఇంకా కోటి 5లక్షల 40 వేల 645 రూపాయాలు మాఫీ కావాల్సి ఉంది. నువ్వు జరిగింది అని నోరు పెద్దగా చేసుకుంటే సరిపోతదా..? నిజంగా రుణమాఫీ జరిగి ఉంటే సురేందర్ రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు. సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు నీవు, నీ కాంగ్రెస్ ప్రభుత్వం కారణం. అది ప్రభుత్వ హత్య. సీఎం ఫెయిల్యూర్ వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
42 లక్షల మందికి 31 వేల కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి 17 వేల కోట్లు మాఫీ చేశావు. సగం మందికి చేయలేదని నీవే చెబుతున్నావు. దొంగతనం చేసిన దొంగే దొంగ దొంగ అన్నాడంట.. సన్నాసి అని నీవు నా గురించి మాట్లాడుతావా..? మోసం చేసిన సన్నాసి అని నిన్ను వందసార్లు అనగలుగుతా.. నీవు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నావా..? వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి మాట తప్పిన సన్నాసివి నీవు. ఆడబిడ్డలకు నెలకు రూ. 2500 ఇవ్వలేదు. 4 వేల పెన్షన్లు ఇవ్వలేదు. అందర్నీ మోసం చేశావు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తానని మోసం చేశావు. ఇలా చాలా ఉన్నాయి. మర్యాద, ఓపికతో ఉన్నాం. నీవు రెచ్చిపోయి మాట్లాడుతున్నవ్.. నీకు రుణమాఫీ వివరాలు పంపిస్తా చూసుకో సన్నాసి అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
Cellulitis | కరీంనగర్లో చర్మ వ్యాధి కలకలం.. విజృంభిస్తున్న సెల్యూలైటిస్..!