జగిత్యాల : ఎలక్ట్రిక్ బైక్(Electric bike) కొన్న నెల రోజుల్లోన్నే పేలిన సంఘటన జగిత్యాల రూరల్(Jagtial) మండలం బాలపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బెతి తిరుపతి రెడ్డి కొద్ది రోజుల క్రితం ఎలక్ట్రిక్ బైక్ కొన్నాడు. కాగా, ఛార్జింగ్ పెట్టిన ఐదు నిమిషాలలోనే బైక్ పేలిపోయిందన్నారు. బైక్ డిక్కీలోనే ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు సుమారు రూ 1.90 లక్ష ఉన్నట్టు బాధితుడు పేర్కొన్నాడు. కొని నలభై రోజులైనా కాకముందే బైక్ పేలడంపై బాధితుడి కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్
జగిత్యాల రూరల్ మండలం బాలపెల్లి గ్రామంలో ఛార్జింగ్ పెట్టిన ఐదు నిమిషాలలోనే పేలిన ఎలక్ట్రిక్ బైక్.
కొని నలభై రోజులైనా కాకముందే బైక్ పేలడం పై బాధితుడు బెతి తిరుపతి రెడ్డి, కుటుంబ సభ్యుల ఆందోళన.
బైక్ డిక్కీలోనే వరి ధాన్యం డబ్బులు సుమారు రూ… pic.twitter.com/xQAzWYNO0C
— Telugu Scribe (@TeluguScribe) November 21, 2024
ఇవి కూడా చదవండి..
Junior Lecturers | జూనియర్ లెక్చరర్స్ ఇంగ్లీష్, మ్యాథ్స్ అభ్యర్థుల తుది జాబితా విడుదల
Harish Rao | ఇవి కూడా ఆయన ఖాతాలోనే వేసుకుంటారేమో..! రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు సెటైర్లు
MLC Kavitha | అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా..? ఎమ్మెల్సీ కవిత ట్వీట్