New Ration Cards | హైదరాబాద్ : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియకు బ్రేక్ పడిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తెలంగాణ సీఈవో సుదర్శన్ రెడ్డి స్పందించారు. రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. టీవీ చానెల్స్‌లో ప్రసారవుతున్న వార్తలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు.
త్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే ప్రజాపాలన, గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. తాజాగా ఆన్లైన్లో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మీ సేవ ద్వారానే రేషన్ కార్డుల్లో పేర్ల చేర్పులు, మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. కానీ అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లను మాత్రం చేయలేదు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం ప్రజలు మీ సేవ సెంటర్‌కు వెళ్తే ఆ సర్వీసు అందుబాటులో లేదని చూపిస్తున్నది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నరు : కేటీఆర్
KTR | చిన్న చిన్న తప్పిదాలతోనే వికారాబాద్‌లో గెలువలేకపోయాం : కేటీఆర్