గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 14:36:31

ఐసీసీఆర్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీకి ఇఫ్లూ వీసీ నామినేట్‌

ఐసీసీఆర్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీకి ఇఫ్లూ వీసీ నామినేట్‌

హైద‌రాబాద్ : ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (ఇఎఫ్‌ఎల్‌యూ) వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఇ. సురేష్ కుమార్ న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) సర్వసభ్య సమావేశానికి నామినేట్ అయ్యారు. జూలై 28వ తేదీన‌ జరిగిన ఐసిసిఆర్ పాలకమండలి సమావేశంలో ప్రొఫెసర్ సురేష్ కుమార్ ఎంపికయ్యారు. మూడేళ్లపాటు ఆయ‌న ఆ ప‌దవిలో కొన‌సాగ‌నున్నారు. కేంద్ర విద్యామంత్రిత్వ‌శాఖ సురేష్ కుమార్‌ను ఇటీవ‌ల యూజీసీ స‌భ్యునిగా నియ‌మించిన విష‌యం తెలిసిందే. 


logo