వ్యాక్సిన్ తీసుకున్న అమెరికన్లకు శుభవార్త.. ఇక మాస్కులు లేకుండా తిరగొచ్చు
అమెరికాలో టీకా డోసులను పూర్తిగా తీసుకున్న వారికి శుభవార్త..! ఇకపై వారు మాస్కులు ధరించకుండానే బయట తిరుగొచ్చు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) జారీ చేసింది.

న్యూయార్క్ : అమెరికాలో టీకా డోసులను పూర్తిగా తీసుకున్న వారికి శుభవార్త..! ఇకపై వారు మాస్కులు ధరించకుండానే బయట తిరుగొచ్చు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) జారీ చేసింది. అమెరికాలో ఇప్పటివరకు పెద్ద వారిలో 40 శాతం మందికి టీకా డోసులు పూర్తిగా ఇచ్చినట్లు అక్కడి గణాంకాలు చెప్తున్నాయి.
మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సీడీసీ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా వ్యాక్సిన్ పూర్తి మోతాదు తీసుకున్న వ్యక్తులు మాత్రమే ఇకపై ఇంటి లోపల లేదా ఇంటి బయట మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిన అవసరం లేదని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. టీకా పూర్తి మోతాదు తీసుకున్న వ్యక్తులు ఒంటరిగా లేదా కుటుంబ సభ్యులతో మోటారు సైకిళ్ళు లేదా కాలినడకన బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. వారు పూర్తి టీకాలు తీసుకున్న ఇతరులతో కలిసి క్లోజ్డ్ స్టేడియంలలో లేదా ఇతర క్లోజ్డ్ ప్రదేశాల్లోగానీ మాస్కులు లేకుండా వెళ్ళవచ్చు. అలాగే, పూర్తిగా టీకాలు తీసుకున్న వారు ఇండోర్ కార్యకలాపాల కోసం, క్షౌరశాలలకు వెళ్ళడానికి అనుమతించారు. అయితే, ఎక్కువ మొత్తంలో జనం గుమిగూడితే మాత్రం ముందస్తు రక్షణ చర్యగా మాస్కులు ధరించడం, నిర్ణీత భౌతిక దూరం పాటించడం అలవర్చుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
ఇక టీకా మందులు తీసుకోని వ్యక్తులు మాస్కులు ధరించడం కొన్ని పరిస్థితులలో తప్పా మాస్కులు ధరించాలని మార్గదర్శకాల్లో సూచించింది. మార్గదర్శకాల ప్రకారం.. ఫైజర్, మొర్దానా, జాన్సన్ టీకాలు తీసుకోని వ్యక్తులు బహిరంగ కార్యక్రమానికి మాస్కులు తప్పకుండా ధరించాలి. రెస్టారెంట్లలో మాస్కులు ధరించాల్సిందేనని సీడీసీ పేర్కొన్నది. ప్రజలు తమను , ఇతరులను రక్షించడానికి ఈ సమాచారాన్ని వ్యక్తిగత బాధ్యతగా ఉపయోగించాలని సీడీసీ డైరెక్టర్ రోషెల్ వాలెన్స్కీ సూచించారు.
ఇవి కూడా చదవండి..
బ్రెగ్జిట్ తర్వాత వాణిజ్య ఒప్పందాన్ని ఆమోదించిన ఈయూ ఎంపీలు
సుప్రీం జస్టిస్ బ్లాక్ మెయిల్‌కు పాక్ ప్రభుత్వం విఫల యత్నం: బిలావాల్ భుట్టో
5 రోజుల్లోనే నిర్మించిన తొలి 3డీ ప్రింటింగ్ ఇల్లు
ఢిల్లీలో అమల్లోకి వచ్చిన ఎన్సీటీ బిల్లు
ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా కరోనా రావొచ్చు : డాక్టర్ రణదీప్ గులేరియా
దమ్ముంటే నాపై పోటీ చేయాలి : సిద్దుకు కెప్టెన్ ఛాలెంజ్
ఇద్దరు నియంతలు.. ఒకరి జననం.. ఒకరి మరణం.. చరిత్రలో ఈరోజు
పోలీసుల డాటా చోరీ, ఆపై బ్లాక్ మెయిలింగ్..
ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో సర్వేలో వెల్లడి
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

