e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News సుప్రీంకోర్టు న్యాయమూర్తిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న ఇమ్రాన్ సర్కార్‌ : బిలావాల్ భుట్టో

సుప్రీంకోర్టు న్యాయమూర్తిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న ఇమ్రాన్ సర్కార్‌ : బిలావాల్ భుట్టో

సుప్రీంకోర్టు న్యాయమూర్తిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న ఇమ్రాన్ సర్కార్‌ : బిలావాల్ భుట్టో

కరాచీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వం బ్లాక్ మెయిల్ చేసేందుకు య‌త్నిస్తున్న‌ద‌ని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావాల్ భుట్టో అభియోగాలు మోపారు. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఖాజీ ఫైజ్‌ ఇషా ఇంతకుముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక తీర్పులు వెలువ‌రించారు. జ‌స్టిస్ ఇషాను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ఇమ్రాన్ ఖాన్‌ ప్రభుత్వం ఫెడరల్ బ్యూరో ఆఫ్ రెవెన్యూతో విచారణ జరిపించి ఆయ‌న‌ కుటుంబాలపై విదేశీ ఆస్తులను లెక్కించలేదని కేసు వేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తన స్వంత ఉత్తర్వుపై పునఃపరిశీలన పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది. జ‌స్టిస్ ఇషా మ‌రికొద్ది రోజుల్లో ఆ దేశ‌ చీఫ్ జస్టిస్ అయ్యే స్థితిలో ఉన్నారు.

జ‌స్టిస్ ఇషాను బ్లాక్ మెయిల్ చేసి వేధించడానికి ప్రయత్నిస్తున్న వారిపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని బిలావాల్ భుట్టో డిమాండ్ చేశారు. ఇమ్రాన్ ప్రభుత్వం చేసిన ఈ చర్య ఇతర న్యాయమూర్తులకు భయం కలిగించే సందేశాన్ని పంపుతుందని, ఇది న్యాయమైన న్యాయానికి ప్రాణాంతకం అని బిలావ‌ల్ భుట్టో అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇదే స‌మ‌యంలో ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ ఎంపీ అస్లాం ఖాన్ వీడియో వైరల్ అవుతున్న‌ది, ఈ వీడియోలో అతను తన భద్రతా సిబ్బందితో పాటు మొబైల్ దుకాణదారుడిని కొడుతున్నాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది. ఎంపీ త‌న అధికారాన్ని దుర్వినియోగం చేయ‌డం ద్వారా కరాచీ దుకాణదారులను బెదిరిస్తున్నార‌ని నెటిజెన్లు వ్యాఖ్యానించారు. ఎంపీపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు ఇక్కడి వ్యాపార సంస్థలు ప్రయత్నిస్తున్న‌ట్లుగా స‌మాచారం.

ఇవి కూడా చ‌ద‌వండి..

5 రోజుల్లోనే నిర్మించిన తొలి 3డీ ప్రింటింగ్ ఇల్లు

ఢిల్లీలో అమ‌ల్లోకి వ‌చ్చిన‌ ఎన్‌సీటీ బిల్లు

ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వ‌చ్చినా క‌రోనా రావొచ్చు : డాక్టర్ రణదీప్ గులేరియా

ద‌మ్ముంటే నాపై పోటీ చేయాలి : సిద్దుకు కెప్టెన్‌ ఛాలెంజ్‌

ఇద్ద‌రు నియంత‌లు.. ఒక‌రి జ‌న‌నం.. ఒక‌రి మ‌ర‌ణం.. చ‌రిత్ర‌లో ఈరోజు

పోలీసుల డాటా చోరీ, ఆపై బ్లాక్ మెయిలింగ్‌..

ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో స‌ర్వేలో వెల్ల‌డి

మే నెల‌లో బాంకుల‌కు 12 సెల‌వులు.. త‌గ్గ‌నున్న ప‌ని గంట‌లు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సుప్రీంకోర్టు న్యాయమూర్తిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న ఇమ్రాన్ సర్కార్‌ : బిలావాల్ భుట్టో

ట్రెండింగ్‌

Advertisement