5 రోజుల్లోనే నిర్మించిన తొలి 3డీ ప్రింటింగ్ ఇల్లు
కేవలం 5 రోజుల్లోనే 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో తొలి ఇంటిని నిర్మించారు

చెన్నై : కేవలం 5 రోజుల్లోనే 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో తొలి ఇంటిని నిర్మించారు. ఈ ఇల్లు సాంప్రదాయ ఇంటి కంటే 30 శాతం తక్కువ ఖర్చు అవుతుందంట. సమయాన్ని ఆదా చేయడమే కాకుండా కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుందని చెప్తున్నారు ఈ ఇంటి నిర్మాణదారులు.
ఐఐటీ-మద్రాస్ పూర్వ విద్యార్థులు కేవలం 5 రోజుల్లో 3 డీ ప్రింటర్‌తో సిమెంట్ కాంక్రీట్ ఇంటిని నిర్మించారు. చెన్నై క్యాంపస్‌లో 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇల్లు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది.
ఈ ఇల్లు మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఇంటి నిర్మాణం ఆలోచన నుంచి డిజైన్ వరకు పూర్తిగా ప్రతిదీ ‘మేడ్ ఇన్ ఇండియా’. ఇది గృహనిర్మాణ రంగంలో ఒక విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానంగా పరిగణించబడుతున్నది. భవిష్యత్తులో ‘బిల్డ్’ కు బదులుగా ‘ప్రింట్’ అనే పదాన్ని చౌకగా, బలమైన ఇళ్ళు నిర్మించడానికి ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి.
ఐఐటీ మద్రాసులో మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన ముగ్గురు పూర్వ విద్యార్థులు.. టీస్టా మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ వ్యవస్థాపకులు అయిన ఆదిత్య వీఎస్ (సీఈఓ), విద్యాశంకర్ సీ (సీఓఓ), పరివర్తన్ రెడ్డి (సీటీఓ) ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు.
తొలుల ఇంటిలోని వివిధ భాగాలను వర్క్‌షాప్‌లో ముద్రించి, ఆపై క్రేన్ ద్వారా చెన్నై క్యాంపస్‌కు చేర్చారు. అక్కడ 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో పడకగది, హాల్, వంటగది వంటి వాటితో ఇంటిని నిర్మించారు. ఖాళీ స్థలం లభిస్తే తమ ఫౌండేషన్ నుంచి ప్రతి సదుపాయంతో వెయ్యి చదరపు అడుగుల ఇల్లు కేవలం రెండు, రెండున్నర వారాల్లో నిర్మించి ఇస్తామని టీస్టా సీఓఓ విద్యాశంకర్ చెప్తున్నారు.
ఈ ఇంటిని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తూ దేశానికి ఇలాంటి పరిష్కారాలు అవసరమని చెప్పారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం గురించి ఇంతకుముందే ప్రభుత్వానికి తెలిసి ఉంటే, అనేక నగరాల్లో నిర్మిస్తున్న గృహాలలో దీనిని ఉపయోగించుకోవచ్చని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీలో అమల్లోకి వచ్చిన ఎన్సీటీ బిల్లు
ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా కరోనా రావొచ్చు : డాక్టర్ రణదీప్ గులేరియా
దమ్ముంటే నాపై పోటీ చేయాలి : సిద్దుకు కెప్టెన్ ఛాలెంజ్
ఇద్దరు నియంతలు.. ఒకరి జననం.. ఒకరి మరణం.. చరిత్రలో ఈరోజు
పోలీసుల డాటా చోరీ, ఆపై బ్లాక్ మెయిలింగ్..
అమెరికా జనాభా 33 మిలియన్లు.. 2020 సెన్సెస్ డాటా విడుదల
ఇతను ఆఫ్రికా రామ్‌దేవ్ బాబా..! వీడియో వైరల్
ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో సర్వేలో వెల్లడి
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

