e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News ఇద్ద‌రు నియంత‌లు.. ఒక‌రి జ‌న‌నం.. ఒక‌రి మ‌ర‌ణం.. చ‌రిత్ర‌లో ఈరోజు

ఇద్ద‌రు నియంత‌లు.. ఒక‌రి జ‌న‌నం.. ఒక‌రి మ‌ర‌ణం.. చ‌రిత్ర‌లో ఈరోజు

ఇద్ద‌రు నియంత‌లు.. ఒక‌రి జ‌న‌నం.. ఒక‌రి మ‌ర‌ణం.. చ‌రిత్ర‌లో ఈరోజు

కొన్ని సంఘ‌ట‌నలు యాధృచ్చికంగా జ‌రుగుతుంటాయి. ప్ర‌పంచ చ‌రిత్ర‌లో తిరుగులేని నాయ‌కులుగా వెలుగొందిన ఇద్ద‌రు నియంత‌ల్లో ఒక‌రు స‌రిగ్గా ఇదే రోజున జ‌న్మించ‌గా.. మ‌రొకరు ఇదే రోజున దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యారు. జ‌న్మించింది స‌ద్దాం హుస్సేన్ కాగా.. చ‌నిపోయింది ఇట‌లీ నియంత ముస్సోలిని.

సద్దాం హుస్సేన్ 1937 లో స‌రిగ్గా ఇదే రోజున‌ బాగ్దాద్‌కు ఉత్తరాన ఉన్న‌ తిక్రిత్ అనే గ్రామంలో జన్మించాడు. బాగ్దాద్‌లో నివసిస్తున్నప్పుడు లా చదివాడు. 1957 లో అతను అరబ్ జాతీయవాదం యొక్క సోషలిస్ట్ ప్రచారం చేప‌ట్టే బాత్ పార్టీలో చేరాడు. ఇక అప్ప‌టి నుంచి వెను దిరిగి చూడ‌కుండా ఇరాక్ అధ్య‌క్షుడి స్థాయికి చేరుకున్నారు.

అగ్రరాజ్యం అమెరికాతో పాటు ప్రపంచ ఆయిల్ కంపెనీల సామ్రాజ్యవాదులను గడగడలాడించాడు. 1976 జూలై 16 నుంచి 2003 ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకు ఇరాక్‌ను అప్రతిహతంగా పాలించాడు. సద్దాం హుస్సేన్ అధికారంలో ఉన్నంత కాలం ఇరాక్ రాజుగానే కాకుండా ప్రపంచ దేశాలపై సైతం తన ఆధిపత్యాన్ని చెలాయించాడు. అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ఇరాక్ ఆక్రమణలో పదవి కోల్పోయారు. యుద్ధానంతరం అమెరికా సేనలకు బందీగా పట్టుబడి, ఇరాక్ న్యాయస్థానంలో విచారణ తరువాత 2006 డిసెంబరు 20వ తేదీన ఉరి తీశారు.

సద్దాం హుస్సేన్‌ లో ఎక్కువగా సైద్ధాంతిక భావాలుండేవి. అంతటి క్రూరుడిలో కూడా ఒక రొమాంటిక్‌ యాంగిల్‌ ఉండేది. ఆయన ఎక్కువగా నవలలు రాసేవారు. అవి కూడా రొమాంటిక్‌ నవలలు. ఇరాక్‌ చరిత్ర ఆధారంగా జబీబా అండ్‌ ది కింగ్‌ అనే నవలను ఈయన రాశారు.

సొంత మ‌నుషుల చేతిలో హ‌త్య‌కు గురైన ముస్సోలిని

ముస్సోలినీ 1883లో ఇటలీలో ఫోర్లీ అనే గ్రామంలో ఒక కమ్మరి కుటుంబములో జన్మించాడు. విద్యార్థిదశలోనే రాచరిక సర్వాధికారాన్ని ప్రబోధించు గ్రంథములను చదివి విప్లవ సామ్యవాదిగా మారాడు.కొతకాలము తర్వాత సోషలిస్టు పత్రికైన అవంత్ కు సంపాదకత్వం వహించాడు. మొదట ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించినప్పటికీ.. తరువాత సామ్యవాద సిద్ధాంతాలను స్విట్జర్లాండ్,ఆస్ట్రియా,ఇటలీ లలో ప్రచారం చేసాడు.

ఇటలీ నియంతగా ముస్సోలిని పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఈయన ఇటలీ ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత హిట్లర్‌తో చేతులు కలిపాడు. రెండో ప్రపంచయుద్ధం తలెత్తడానికి ఇతను కూడా ప్రధాన కారకుడు. ఇటలీ వైభవాన్ని ఓ స్థాయికి తీసుకెళ్లిన ఘనుడు ఈయన. రాజకీయంగా కర్కశంగా ఉన్నా ప్రజలకు కొన్ని రకాల పనులతో ఎంతో మేలు చేశాడ‌ని చెప్తుంటారు చ‌రిత్ర‌కారులు.

1922 నవంబర్ పదహారున ప్రధానిగా బాధ్యతలు చేబట్టాడు. అధికారాన్ని నిలుపుకునేందుకు నియంత‌గా మారారు. అప్ప‌టి నుంచి ఇట‌లీ ప్ర‌ధానిగా 1943 జూలై 25 వ‌ర‌కు కొన‌సాగారు. అప్పట్లో ప్రజలందరికి ఐడెంటిటి కార్డ్ లు ఇచ్చిన ఘనత ముస్సోలినీదే. దురదృష్టవశాత్తు ఇతడి సొంత మనుషులే ఇతడిని 1945 లో స‌రిగ్గా ఇదే రోజున‌ కాల్చి చంపారు.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు

2008: పీఎస్‌ఎల్‌వీ-సీ9 తో కలిసి 10 ఉపగ్రహాలను ప్ర‌యోగించి చరిత్ర సృష్టించిన ఇస్రో

2007: శ్రీలంకను ఓడించి నాలుగోసారి ప్రపంచ క్రికెట్ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా

2003: ఆపిల్ ఐట్యూన్స్ స్టోర్‌ను ప్రారంభం

2002: అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రజాభిప్రాయ సేకరణను ధ్రువీకరించిన పాకిస్తాన్ సుప్రీంకోర్టు

2001: మొదటి అంతరిక్ష పర్యాటకుడుగా పేరు న‌మోదు చేసుకున్న అమెరికన్ వ్యాపారవేత్త డెన్నిస్ టిటో

1910: ఇంగ్లండ్‌లో విమానాన్ని రాత్రి వేళ‌లో తొలిసారిగా ప్ర‌యాణించిన‌ క్లాడ్ గ్రాహం వైట్ అనే పైలట్

ఇవి కూడా చ‌ద‌వండి..

పోలీసుల డాటా చోరీ, ఆపై బ్లాక్ మెయిలింగ్‌..

అమెరికా జ‌నాభా 33 మిలియ‌న్లు.. 2020 సెన్సెస్ డాటా విడుద‌ల‌

ఇత‌ను ఆఫ్రికా రామ్‌దేవ్ బాబా..! వీడియో వైర‌ల్‌

ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో స‌ర్వేలో వెల్ల‌డి

మే నెల‌లో బాంకుల‌కు 12 సెల‌వులు.. త‌గ్గ‌నున్న ప‌ని గంట‌లు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇద్ద‌రు నియంత‌లు.. ఒక‌రి జ‌న‌నం.. ఒక‌రి మ‌ర‌ణం.. చ‌రిత్ర‌లో ఈరోజు

ట్రెండింగ్‌

Advertisement