Khaja Moinuddin | ఇటీవలే నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్‌లో అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ దుండగుల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. హైకోర్టు , సిటీ సివిల్ కోర్టులో న్యాయవాదిగా ఉన్న ఖాజా మొయినుద్దీన్ కబ్జాకు గురవుతున్న వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన హత్య జరిగినట్లు పలువురు అనుమానిస్తున్నారు. అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ చేసి హత్య చేసినట్టుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు.
సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నలుగురు దుండగులు ఖాజా మొయినుద్దీన్ ఇంటి సమీపంలో ఉదయం నుంచి మాటు వేసి నెంబర్ ప్లేట్ లేని స్కార్పియో కారుతో గుద్ది హత్య చేసినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారని తెలిసిందే. ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో ప్రధాన నిందితులైన కాంగ్రెస్ నాయకుడు ఆలం ఖాన్, అతడి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారని తెలిసిందే. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే ఖాజా మొయినుద్దీన్ కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈ హత్య కేసును బైక్ స్టంట్స్ చేసే వ్యక్తితో హిట్ అండ్ రన్‌గా చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.మొయినుద్దీన్‌ను హత్య చేసేందుకు వినయ్ అనే వ్యక్తికి నిందితులు సుపారీ ఇవ్వగా.. హిట్ అండ్ రన్‌గా చిత్రీకరించేందుకు ఇన్స్టాగ్రామ్ వేదికగా బైక్ స్టంట్స్ పోస్ట్ చేస్తున్న అభిజిత్ అలియాస్ నాని అనే వ్యక్తిని వినయ్ పురమాయించినట్టుగా తాజాగా ఓ కథనం తెరపైకి వచ్చింది.
హిట్ అండ్ రన్ చేసి ఓ వ్యక్తిని ఢీకొట్టాలని రూ.2 లక్షలు వస్తాయని పట్టుబడితే ఆక్సిడెంట్ కేసులో వెంటనే బయటికి వస్తామని వినయ్ చెప్పిన మాటలు విని అభిజిత్ ఒప్పుకున్నట్టుగా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. మొయినుద్దీన్‌ను ఢీకొట్టి నాంపల్లి నుండి తుక్కుగూడా(50 కిలోమీటర్లు) కేవలం 13 నిమిషాల్లోనే వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్టు సమాచారం.
బైక్ స్టంట్స్ చేసే వ్యక్తితో హిట్ అండ్ రన్‌గా చిత్రీకరించేందుకు ప్లాన్
న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి కొత్త అంశం
మొయినుద్దీన్‌ను హత్య చేసేందుకు వినయ్ అనే వ్యక్తికి నిందితులు సుపారీ ఇవ్వగా, హిట్ అండ్ రన్‌గా చిత్రీకరించేందుకు ఇన్స్టాగ్రామ్ వేదికగా బైక్… https://t.co/N9eelO0uYi pic.twitter.com/YMuBvrGT3X
— Telugu Scribe (@TeluguScribe) May 31, 2026
Naga Chaitanya | నీతో జీవితాన్ని పంచుకోవడం నా అదృష్టం.. శోభిత బర్త్‌డేపై నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్
Mahesh Babu | ఎప్పటికీ మీరే నా హీరో నాన్న .. కృష్ణ జయంతి సందర్భంగా మహేశ్‌బాబు ఎమోషనల్ పోస్ట్
ముగ్గురు స్నేహితులను కాపాడి కాపాడి ఆ పై తాను మృతి చెంది..అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి