సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 05, 2021 , 02:19:09

సింగరేణి కార్మికుల సంక్షేమానికి కృషి

సింగరేణి కార్మికుల సంక్షేమానికి కృషి

  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌, జనవరి 4 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికుల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సింగరేణి కార్మిక సంఘం, టీబీజీకేఎస్‌, సింగరేణి కాలరీస్‌ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు కవితను సోమవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిశారు. రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి సీఎం కేసీఆర్‌ సింగరేణి అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి చేస్తున్న కృషిని ఎమ్మెల్సీ వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు సమర్పించిన విజ్ఞప్తులపై ఆమె స్పం దిస్తూ వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని చె ప్పారు. ఎమ్మెల్సీని కలిసినవారిలో టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు ఆరెపల్లి రాజేందర్‌, రాజేశ్వర్‌, రమేశ్‌ ఉన్నారు.


logo