Ponguleti Srinivas Reddy | హైదరాబాద్ : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. లగ్జరీ వాచ్‌ల కుంభకోణం నేపథ్యంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, ఫామ్ హౌజ్‌తో పాటు తదితర ఐదు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు.
గతంలో ఆయన కుమారుడు హర్ష రెడ్డికి కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సింగపూర్ నుంచి చెన్నై పోర్టుకు ఖరీదైన వాచ్‌లు వచ్చినట్లు గుర్తించారు. అలోకం నవీన్ కుమార్ మధ్యవర్తిగా ఫహెర్దీన్ ముబీన్ నుంచి వాచ్‌లను హర్ష కొనుగోలు చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. విచారణలో అలోకం నవీన్ రూ. 100 కోట్ల విలువైన వస్తువులు స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై మనీలాండరింగ్ సహా మరో కేసు నమోదు చేసిన ఈడీ విచారణను ముమ్మరం చేసింది.
ఇవి కూడా చదవండి..
HCL | హైదరాబాద్‌లో మరో కొత్త హెచ్‌సీఎల్ క్యాంపస్.. 5 వేల మంది ఇంజినీర్లకు ఉద్యోగాలు..!
HYDRAA | హైడ్రాపై హైకోర్టు సీరియస్.. విచారణకు హాజరు కావాలని రంగనాథ్‌కు ఆదేశం