ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 13:31:38

పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం

పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం

మహబూబాబాద్ : ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే అది స్వర్గసీమ అవుతుందని, ప్రతి ఒక్కరు తమ ఇంటిని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం10 గంటల10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ లోని తన నివాసంలో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంట్లోని కిచెన్, హాల్, కిటికీలు, ఫ్రిజ్, ఇంటి ఆవరణలోని వరండాలను మంత్రి శుభ్రం చేశారు. దోమలు రాకుండా ఉండాలంటే ఇళ్లు పరిశుభ్రంగా ఉండాలని, దుమ్ము, ధూళి లేకుండా ఉన్నప్పుడే ఇంట్లో ఆహ్లాదం ఉంటుందన్నారు.

మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో తాను కూడా ఇంటిని శుభ్రం చేసుకునే అవకాశం కలిగిందని, ఈ కార్యక్రమం వల్లే విధిగా ఈ సమయానికి ఇంట్లో ఉండి, పరిసరాల పరిశుభ్రత పాటిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఇష్టంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఇంటిని తద్వారా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. సీజనల్ వ్యాధులను తరిమికొట్టి ఆరోగ్య తెలంగాణలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. 


logo