తిమ్మాజిపేట, నవంబర్ 23 : మద్యం లారీలకు(Liquor lorries) రక్షణ కల్పించాలని మద్యం లారీ యజమానులు డిమాండ్ చేశారు. శనివారం నాగర్కర్నూల్(Nagarkurnool) జిల్లా తిమ్మాజిపేటలోని టీజీబీసీఎల్ స్టాక్ పాయింట్ వద్ద వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో లారీల నుంచి మద్యం చోరీకి గురవుతున్నదని వాపోయారు. దీంతో పోయిన మద్యం విలువ మేము చేతి నుంచి చెల్లించాల్సి వస్తుందని, అందుకే స్టాక్ పాయింట్ అధికారులు మద్యం లారీలకు రక్షణ కల్పించాలన్నారు. పలు దఫాలుగా చర్చలు నిర్వహించినా ఫలితం లభించకపోవడంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి కృషి చేస్తామని స్టాక్ పాయింట్ అధికారులు తెలిపారు. అధికారుల హామీతో లారీ యజమానులు ధర్నా విరమించారు.