Perth Test : రసవత్తరంగా సాగుతున్న పెర్త్ టెస్టులో భారత జట్టు (Team India) పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు కూడా అదరగొట్టిన టీమిండియా రెండొందలకు పైగా ఆధిక్యం సాధించింది. ఆసీస్ బ్యాటర్లు తడబడిన చోట ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(90 నాటౌట్), కేఎల్ రాహుల్(62 నాటౌట్)లు కుమ్మేశారు. ప్రపంచ స్థాయి పేస్ దళాన్ని అలవోకగా ఎదుర్నొన్నారు. దాంతో, కంగారు పేసర్లకు ఏం ఏయాలో పాలుపోలేదు. ఈ క్రమంలోనే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్(Sledging) కూడా ఆటను మరింత రక్తి కట్టించింది.
రెండో ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్ ఆస్ట్రేలియా బౌలర్లకు విసుగు పుట్టించాడు. క్రీజులో పాతకుపోయిన అతడు సులువుగా పరుగులు రాబట్టాడు. ఇక మిస్సైల్ స్టార్క్ ఓవర్లో యశస్వీ బ్యాక్ ఫుట్మీద డిఫెన్స్ ఆడుతూ అందర్నీ ఆకట్టుకున్నాడు. అంతేకాదు అతడి ఓవర్లో ఫైన్‌లెగ్‌లో సిక్సర్ కూడా బాదాడు. దాంతో, స్టార్క్ అతడిని కొరకొరా చూశాడు.
“It’s coming too slow!”
Yashasvi to Starcpic.twitter.com/lLR7C1mSr9
— Cricketopia (@CricketopiaCom) November 23, 2024
అందుకు తగ్గేదేలే అన్నట్టు ‘ఏంటీ.. బంతి చాలా నెమ్మదిగా వస్తోంది. పేస్ తగ్గింది?’ అని యశస్వీ నోటితో బదులిచ్చాడు. అంతకుముందు ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టార్క్ భారత పేసర్ హర్షిత్ రానా బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డాడు. హర్షిత్ బౌన్సర్లు సంధించడంతో ఆడలేపోయిన అతడు.. ‘నేను నీకంటే వేగంగా బౌలింగ్ చేయాగలను. నాకు జ్ఞాపక శక్తి చాలానే ఉంది’ అని నోటికి పని చెప్పాడు. అందుకు హర్షిత్ ‘నాకు తెలుసులే’ అన్నట్టు నవ్వు విసిరాడు.
Some exchange of words between former KKR teammates.
Harshit bowls a short of length against Starc to which Starc replies – “I bowl faster than you Harshit, I have got a long memory”#INDvsAUS pic.twitter.com/IYpzlNeksw
— Dhaval Patel (@CricCrazy0) November 23, 2024
పెర్త్ మైదానంలో టీమిండియా రెండో రోజు సంపూర్ణ ఆధిపత్యం చలాయించింది. యశస్వీ జైస్వాల్(90 నాటౌట్), కేఎల్ రాహుల్(62 నాటౌట్) జోడీ అజేయ అర్ధ శతకాలతో కంగారూ బౌలర్లను కంగారెత్తించింది. బంతి మరీ బౌన్స్ కాకపోవడంతో నింపాదిగా ఆడుతూ టీమిండియా ఆధిక్యాన్ని రెండొందలు దాటించారు. రెండో రోజు ఆట ముగిసే సరికి భారత జట్టు వికెట్ కోల్పోకుండా 172 పరుగులు చేసింది. దాంతో.. పట్టుబిగించిన బుమ్రా సేన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బోణీ కొట్టే దిశగా సాగుతోంది.
That’s Stumps on Day 2 of the first #AUSvIND Test!
A mighty batting performance from #TeamIndia! 💪 💪
9⃣0⃣* for Yashasvi Jaiswal
6⃣2⃣* for KL RahulWe will be back tomorrow for Day 3 action! ⌛️
Scorecard ▶️ https://t.co/gTqS3UPruo pic.twitter.com/JA2APCmCjx
— BCCI (@BCCI) November 23, 2024