Violence | ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో హింస.. 24 గంటల్లో 18 మంది మృతి
Violence | పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన హింసలో 18 మంది దుర్మరణం చెందారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. వాహనాల కాన్వాయ్‌పై దాడి అనంతరం ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని కుర్రం జిల్లా అలీజాయ్, బగన్ తెగల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది.
Violence | పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన హింసలో 18 మంది దుర్మరణం చెందారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. వాహనాల కాన్వాయ్‌పై దాడి అనంతరం ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని కుర్రం జిల్లా అలీజాయ్, బగన్ తెగల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ ఘటనలో 47 మంది వరకు హత్యకు గురయ్యారు. మరో వైపు బలిషెల్, ఖార్ కాలీ, కుంజ్ అలీజాయ్, మక్బాల్లో సైతం కాల్పులు కొనసాగుతున్నాయి. భారీ ఆయుధాలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 18 మంది చనిపోగా, 30 మంది గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో 30 మందికిపైగా మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
ఘర్షణల్లో ఇండ్లతో పాటు దుకాణాలు సైతం ధ్వంసమయ్యాయి. ఘర్షణల నేపథ్యంలో పలువురు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివచ్చారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో శనివారం విద్యాసంస్థలను మూసి ఉంచినట్లు ప్రైవేట్ ఎడ్యుకేషన్ నెట్వర్క్ చైర్మన్ ముహమ్మద్ హయత్ హసన్ తెలిపారు. బగన్, మండూరి, ఓచాట్లో గురువారం 50 మందికిపైగా ప్రయాణికుల వాహనాలపై దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఆరు వాహనాలు ఢీకొట్టడంతో మహిళలు, పిల్లలు సహా 47 మంది ప్రాణాలు కోల్పోయారు. వాహనాలు పరాచినార్ నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. బాధితుల్లో ఎక్కువ మంది షియా వర్గానికి చెందిన వారు ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | మహాత్మా జ్యోతిబా పూలేకు హృదయపూర్వక నివాళులు : హరీశ్‌రావు
Mohabbat | యూత్‌ను ఆకట్టుకుంటున్న ‘మొహబ్బత్’ సినిమాలోని ‘వరమే’ లవ్ సాంగ్!
RS Praveen Kumar | రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో రూ.60 కోట్ల అసైన్డ్ భూముల స్కాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Naga Chaitanya | ‘వృషకర్మ’ రిలీజ్ వేళ నాగచైతన్య సాహస యాత్ర.. పెద్దపల్లి రామగిరి కోటపై ట్రెక్కింగ్ చేస్తూ ఆసక్తికర ముచ్చట్లు!
KTR | నియోజకవర్గాల పునర్విభజనపై మా వైఖరి ఎప్పుడూ స్పష్టమే : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

