Hemant Soren | జార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక్కడ ఎన్డీయే కూటమికి గట్టి షాక్ తగిలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందలు చేస్తూ హేమంత్ సోరెన్ (Hemant Soren) నేతృత్వంలోని జేఎంఎం స్పష్టమైన ఆధిక్యంతో కొనసాగుతోంది. ఇక్కడ జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువు దీరబోతోంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై సీఎం హేమంత్ సోరెన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు విక్టరీని తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నారు. తన ఇద్దరు కుమారులతో ఓ క్యూట్ ఫొటోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. వాళ్లే తన బలం అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ మార్క్ 41 సీట్లు దాటాల్సి ఉంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. ఇండియా కూటమి మ్యాజిక్ మార్క్ 41 సీట్లు దాటేసింది. ఏకంగా 57 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇందులో 18 స్థానాలకు ఫలితం తేలింది. మిగతా 39 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. ఇక ఎన్డీయే కూటమి మొత్తం 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఇప్పటి వరకూ 5 స్థానాల్లో గెలుపొందింది. మిగతా 18 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.
मेरी शक्ति pic.twitter.com/6NP6O6Vl7R
— Hemant Soren (@HemantSorenJMM) November 23, 2024
Also Read..
Devendra Fadnavis | సీఎం పదవి అంశంపై స్పష్టతనిచ్చిన ఫడ్నవీస్.. ఇంతకీ ఏమన్నారంటే..?
Maharashtra CM | షిండేనా.. ఫడ్నవీసా.. మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు..?
Priyanka Gandhi: రాహుల్ గాంధీ రికార్డును బ్రేక్ చేసిన ప్రియాంకా గాంధీ