BMW M5 | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా (BMW India) దేశీయ మార్కెట్లోకి స్పోర్ట్స్ సెడాన్ కారు ఎం5 (M5) కారును ఆవిష్కరించింది. 2025- బీఎండబ్ల్యూ ఎం5 (2025-BMW M5) కారు ధర రూ.1.99 కోట్ల (ఎక్స్ షోరూమ్) కు లభిస్తుంది. అయితే భారత్ మార్కెట్లో ‘కంప్లీట్లీ బిల్ట్ అప్ యూనిట్ (సీబీయూ)గా వస్తున్నది. స్టాండర్డ్ 5 సిరీస్ కార్లలో 2025 బీఎండబ్ల్యూ ఎం5 అత్యంత దూకుడుగా ఉంటుంది. ఫ్రంట్‌లో లిప్ స్పాయిలర్తోపాటు బంపర్లు సమర్థవంతంగా రూపొందించారు. బీఎండబ్ల్యూ ఎం5 కారుకు ఫ్రంట్‌లో 20-అంగుళాల వీల్స్, రేర్‌లో 21-అంగుళాల వీల్స్ రాప్డ్ విత్ హై పెర్ఫార్మెన్స్ టైర్స్ ఉంటాయి.
2025 బీఎండబ్ల్యూ ఎం5 కారు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 4.4 లీటర్ల ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ ప్రస్తుతం విద్యుద్దీకరించారు. బీఎండబ్ల్యూ ఎక్స్ఎం కారు నుంచి హైబ్రీడ్ సెటప్ తీసుకుని ఎం5 కారులో అమర్చారు. ఎం5 కారు వీ8 ఇంజిన్ గరిష్టంగా 577 బీహెచ్పీ విద్యుత్ వెలువరిస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ 773 బీహెచ్పీ పవర్ వెలువరిస్తుంది. హైబ్రీడ్ పవర్ ట్రైన్ 717 బీహెచ్పీ విద్యుత్, 1001 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. కేవలం 3.5 సెకన్లలో 100 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. గరిష్టంగా గంటకు 250 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. పూర్తిగా ఎలక్ట్రిక్ మోటార్ 18.6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో పని చేస్తుంది. 7.4 కిలోవాట్ల చార్జర్ తో బ్యాటరీ చార్జింగ్ చేస్తారు. ఎలక్ట్రిక్ వేరియంట్ గంటకు గరిష్టంగా 140 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.
ఎం5 కారు మల్టీ ఫంక్షనల్ సీట్లు, కొత్తగా రీ డిజైన్ చేసిన ఎం లెదర్ స్టీరింగ్ వీల్, హై ఎండ్ బోయర్స్ అండ్ విల్కిన్స్ డైమండ్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఉంటాయి. కర్వ్డ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ డిస్ప్లే విత్ బీఎండబ్ల్యూ ఆపరేటింగ్ సిస్టమ్ 8.5 పవర్, క్విక్ సెలెక్ట్ నేవీగేషన్, ఎం లాప్ టైమర్, ఆప్టిమల్ పవర్ డెలివరీ కోసం బూస్ట్ కంట్రోల్ వంటి ట్రాక్ రెడీ వంటి ఫీచర్లు ఉంటాయి.
సేఫ్టీ కోసం పార్కింగ్ అసిస్టెంట్ ప్లస్, సరౌండ్ వ్యూ కెమెరా అండ్ రివర్సింగ్ అసిస్టెంట్, పార్కింగ్ అసిస్టెంట్ ప్లస్, రివర్సింగ్ అసిస్టెంట్, ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ మౌంట్స్, ఆప్షనల్ డ్రైవింగ్ అసిస్టెంట్ ప్రొఫెషనల్ ద్వారా ఎన్హాన్స్డ్ సెమీ అటానమస్ డ్రైవింగ్, యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ అండ్ లేన్ కంట్రోల్ అసిస్టెంట్, క్రాస్ ట్రాఫిక్ వార్నింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి.