కల్వకుర్తి, సెప్టెంబర్ 5 : పెండింగ్లో ఉన్న పాల బిల్లులను (Milk bills) వెంటనే చెల్లించాలని పాడి రైతులు(Dairy farmers) రోడ్డెక్కారు. గురువారం నాగర్కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గేట్ వద్ద కోదాడ-జడ్చర్ల ప్రధాన రహదారిపై ధర్నా(Dharna) చేపట్టారు. ఈ సందర్భంగా క్యాన్లలో ఉన్న పాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు.
ప్రభుత్వరంగ సంస్థ అయిన విజయ డెయిరీకి పాలుపోస్తున్నామని, అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిల్లులు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రెండు నెలల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు.
ఇవి కూడా చదవండి..
Konatham Dileep | రేవంత్ సర్కార్ మరో దౌర్జన్యకాండ.. కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్
Jagadish Reddy | అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతులను అడ్డుకోలేరు : జగదీష్ రెడ్డి