ధరణి పోర్టల్ భేష్

సీఏజీ డిప్యూటీ డైరెక్టర్ పూనం కుల్హరి
యాచారం, మార్చి 31 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ధరణి పోర్టల్ పనితీరు బాగున్నదని సీఏజీ డిప్యూటీ డైరెక్టర్ పూనం కుల్హరి ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా యాచారం తాసిల్ కార్యాలయాన్ని బుధవారం కేంద్ర బృందం అధికారులతో కలిసి సందర్శించారు. ధరణి పోర్టల్ పనితీరు గురించి తాసిల్దార్ నాగయ్యను అడిగి తెలుసుకున్నారు. భూముల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్, మ్యుటేషన్, నాలా, విరాసత్, పాస్బుక్కుల అందజేత విధానంపై రెవెన్యూ అధికారులు ఆమెకు వివరించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సుకన్య సమక్షంలో ప్రధానమంత్రి కిసాన్యోజన పథకం అమలుతీరుపై వ్యవసాయాధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ పనితీరు అద్భుతంగా ఉన్నదన్నారు. ధరణి పోర్టల్‌తో రైతులకు దీర్ఘకాలిక సమస్యలు తీరుతున్నాయనీ, 10 నిమిషాల్లోనే భూమి హక్కు పత్రాలు అందడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రబృందం ప్రతినిధులతోపాటు జిల్లా వ్యవసాయాధికారిణి గీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏడీఏ సత్యనారాయణ, మండలాధికారి సందీప్, పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
మహేశ్‌కు మంత్రి కేటీఆర్ భరోసా
ఎఫ్‌సీఐ కావాలనే ఇబ్బంది పెడుతున్నది
ఆటో వద్దనే భూమి రిజిస్ట్రేషన్
రామాయణం, భారతం ప్రపంచానికే తలమానికం
మన పల్లె ప్రగతికి 12 పురస్కారాలు
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్షా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

