చేర్యాల/సిద్దిపేట : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 20 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి.
శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులు చెల్లించుకున్నారు.
మరికొందరు భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అలాగే కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Medaram | ఇక కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే వనదేవతల దర్శనం
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణకు ప్రభుత్వం కృషి : మంత్రి హరీశ్‌రావు
చప్పట్లతో కరెంట్ మోటర్ ఆన్, ఆఫ్..నాగర్‌కర్నూల్ యువకుడి ప్రతిభ