సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 01:54:16

దశలవారీగా గ్రామాల అభివృద్ధి

దశలవారీగా గ్రామాల అభివృద్ధి
  • శాసనమండలిలో పల్లెప్రగతిపై స్వల్పకాలిక చర్చ
  • సమాధానమిచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో గ్రామాలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని, పల్లెప్రగతి కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో పల్లెప్రగతిపై స్వల్పకాలిక చర్చకు ఆయన సమాధాన మిస్తూ.. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని, గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పల్లెప్రగతి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ రూపొందించి, అమలుచేస్తున్నారని చెప్పారు. పల్లెప్రగతిపై నివేదికను మం డలికి సమర్పించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 12,616 గ్రా మాల్లో డంపింగ్‌ యార్డులు ఏ ర్పాటుచేశామని, మిగిలిన 491 గ్రామాల్లో త్వరలోనే స్థలాలు సేకరించి నిర్మిస్తామని తెలిపారు. 2020-21లో గ్రామా ల్లో 23.54 కోట్ల మొక్కలను నాటుతామని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నారైలు, పూర్వ విద్యార్థులు, దాతల నుంచి విరాళాలు సేకరించాలన్నారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పందిస్తూ.. గ్రామాల్లో ఇంకుడుగుంతలు ఏర్పాటుచేయాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చా రు. పంచాయతీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టాలన్నా రు. ట్రాక్లర్ల కొనుగోలు సమయంలో అన్ని పేపర్లు ఉండాలని, డ్రైవర్లకు లైసెన్స్‌లు కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పల్లెప్రగతి బాగుందని, పల్లెలకు వెళ్లే దారుల్లో కంప, చెట్లను తొలగించే ప్రయత్నంచేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని సభ తరఫున మంత్రికి విజ్ఞప్తిచేశారు. విప్‌ కర్నె ప్రభాకర్‌, సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, జాఫ్రీ, జీవన్‌రెడ్డి, రాచందర్‌రావు మాట్లాడారు.


logo