Bhatti Vikramarka | హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిసి రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సచివాలయంలో ఎస్పీడీసీల్లో పదోన్నతులు పొందిన అధికారులు, ఉద్యోగులు.. ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కను అభినందించారు.
ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి భట్టి విక్రమార్క ప్రసంగించారు. ప్రజల జీవితాల్లో మార్పు అంటే వారి జీవనస్థితిగతులు మారడం, కొనుగోలు శక్తి పెరగడం, రాష్ట్ర సంపదలో అంతా భాగస్వాములు కావడం ఆ మార్పు వచ్చినప్పుడే పోరాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రానికి ఫలితం ఉంటుందన్నారు. ఉద్యోగులందరూ కూడా ఈ రాష్ట్రం నాది, ఈ ప్రభుత్వం నాది, ఈ రాష్ట్ర ప్రజలు నా వాళ్ళు, వాళ్ల సేవ కోసమే నేను నియమించబడ్డారని మీరంతా భావించాలని ఉద్యోగులు, అధికారులకు సూచించారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఉద్యోగులు, అధికారులు బాగా పనిచేసే వాతావరణ కల్పించడం కోసం పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఆలోచనలను అమలు చేసే క్రమంలో కింది స్థాయి వరకు ఉద్యోగులు, అధికారులు నిబద్ధతతో పనిచేయాలని తెలిపారు. మీ కష్టసుఖాల్లో ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. మీరు ప్రజల కష్టసుఖాల్లో భాగం కావాలని సూచించారు. అధికారులు, ఉద్యోగులు పెట్టే ప్రతి సంతకం, తీసుకునే ప్రతి నిర్ణయం, చేసే ప్రతి పని సామాన్యుడికి ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. మీ పనిలో మానవీయకోణం ఉండాలని విక్రమార్క అన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | రాజీవ్ విగ్రహం పెట్టడమంటే.. తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేసినట్లే.. : కేటీఆర్
TG Rains | తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలే.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
Heavy rain | నిజామాబాద్లో కుండపోత వర్షం.. వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు