Karimnagar | కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి వద్ద తోటపల్లి రిజర్వాయర్ నుంచి మానకొండూర్‌కు నీటిని తరలించే డీ- 4 కాలువకు ఆదివారం తెల్లవారుజామున గండి పడింది. దీంతో గ్రామంలోని ఎస్సీ కాలనీలోని నివాస గృహాల్లోకి పెద్ద ఎత్తున వరద వచ్చింది. తెల్లవారు జాము నుంచి పెద్ద ఎత్తున వరద నీరు గ్రామంలోకి చేరుతున్నందున స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
తోటపల్లి రిజర్వాయర్ నుండి డీ-4 కాల్వ ద్వారా తిమ్మాపూర్ మానకొండూరు మండలాల్లోని పలు గ్రామాలకు ఈ నీరు చేరుతుంది. అయితే మన్నెంపల్లి నుండి మానకొండూర్ కు నీళ్లు వెళ్ళేందుకు అక్కడ రైతులు చిన్న చిన్న కాలువల తూములను మోసవేశారు. అంతే కాకుండా ఎస్సీ కాలనీ వద్ద కాలువ నాసిరకంగా ఉండడం వల్ల తరచూ తెగిపోతుంది. ఇప్పటివరకు ఐదు సార్లు తెగినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. తరుచూ కాలువకు గండి పడి ఇండ్లలోకి నీళ్లు చేరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మరోసారి ఇలా జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
కాలువకు గండి పడటంతో దిగువ ప్రాంతంలో ఉన్న ఎస్సీ కాలనీలోని వీధులు జలమయమైనాయి. దిగువ ప్రాంతంలో ఉన్న పంట పొలాల్లోకి వరద చేరింది. స్థానిక మాజీ సర్పంచ్ మేడి అంజయ్య, ఉప సర్పంచ్ వెంకటేష్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలియడంతో తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలెక్టర్ పమేలా సత్పతిని ఆదేశించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మన్నెంపల్లికి వచ్చారు. అధికారుల జాడ మాత్రం ఇప్పటి వరకు లేదు.
కెనాల్‌కు గండి.. జలమయమైన గ్రామం
ఇండ్లలోకి నీళ్లు రావడంతో కొట్టుకుపోయిన నిత్యావసర సరుకులు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలోని కెనాల్‌కు గండి పడడంతో జలమయమైన గ్రామం
తోటపల్లి రిజర్వాయర్ లింకు కెనాల్ ద్వారా చిగురుమామిడి, తిమ్మాపూర్ మండలంలోని ఎగువ… pic.twitter.com/UhHeI22Id6
— Telugu Scribe (@TeluguScribe) January 12, 2025
ఇవి కూడా చదవండి..
RS Praveen Kumar | అలిశెట్టి రక్తరేఖను తప్పకుండా చదవండి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Bhuvanagiri | భువనగిరిలో బీఆర్ఎస్ మహా ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ.. భారీగా మోహరించిన పోలీసులు
Rythu Bharosa | సాగుయోగ్యమైన భూములకే రైతు భరోసా.. 26 నుంచి నిధులు పంపిణీ