గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 01:55:15

నేరచరిత్ర చెప్పాల్సిందే..

నేరచరిత్ర చెప్పాల్సిందే..

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలతోపాటు తమ నేర చరిత్రను విధిగా వెల్లడించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నేర చరిత్రతోపాటు అభ్యర్థి ఆస్తులు, ఆదాయాలు, బాధ్యతలు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని రూ.20 స్టాంప్‌ పేపర్‌పై నోటరీ చేసి నిర్దేశించిన ప్రొఫార్మాలో అఫిడవిట్‌ సమర్పించాలని సూచించింది. నామినేషన్‌ పత్రంలో ప్రతి కాలమ్‌ను తప్పనిసరిగా నింపాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీగా వదిలేయకూడదని సూచించింది. అసంపూర్తి, అసమగ్ర సమచారం సమర్పించే వారి నామినేషన్లు చెల్లవని  పేర్కొన్నది. అసంపూర్తిగా దాఖలు చేసే నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు (ఆర్వో) తిరస్కరిస్తారని తెలిపింది. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, రిటర్నింగ్‌ అధికారులు ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి జయసింహారెడ్డి గురువారం ఆదేశాలు జారీచేశారు.