CV Anand | హైదరాబాద్ భద్రతపై సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆపరేషన్ అభ్యాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాకిస్తాన్‌పై దాడి తర్వాత శాంతి భద్రతల నోడల్ అధికారిగా పీవీ ఆనంద్ నియామకమయ్యారు.
హైదరాబాద్‌లో ఉన్న డిఫెన్స్ కార్యాలయాలకు హైసెక్యూరిటీ ఇచ్చామని, సివిల్ ఏరియాతో పాటు డిఫెన్స్ ఏరియాలో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. సాధారణ పరిస్థితులు ఏర్పడేదాకా ప్రభుత్వ అధికారుల లీవ్స్ రద్దు చేసినట్టు పేర్కొన్నారు. నగరంలో మాక్‌డ్రిల్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. కొద్దిసేపట్లో హైదరాబాద్‌లో మాక్‌డ్రిల్ జరుగుతుందని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు ఐసీసీసీ నుంచి జీహెచ్ఎంసీ ప్రాంతానికి సందేశం వెళ్తుందన్నారు. రెండు నిమిషాల పాటు సైరన్ మోగుతుందని పేర్కొన్నారు. సైరన్ మోగిన తర్వాత ప్రజలకు స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.
సైరన్ మోగిన తర్వాత ప్రజలు ఇండ్లల్లోనే ఉండాలని.. బయటకు రావొద్దన్నారు. బయట ఉన్న వారు సురక్షిత నిర్మాణాల్లోకి వెళ్లిపోవాలని.. వాహనాలపై వెళ్తున్న వారు తమ వాహనాలను నిలిపివేసి సమీప నిర్మాణాల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఇవాళ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ జరుగుతుందన్నారు. సుమారు 15 నిమిషాల పాటు కొనసాగుతుందన్నారు. నానల్‌నగర్, కంచన్‌బాగ్, సికింద్రాబాద్, ఈసీఐఎల్ ఎన్ఎఫ్సీ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరుగుతుందన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపకశాఖ వ్యవహారించాల్సిన తీరుపై ఆదేశాలు వెళ్తాయన్నారు.
వచ్చే కొన్ని రోజుల పాటు సంబంధిత విభాగాల్లో ఎవరూ సెలవులు తీసుకోవద్దని ఆదేశాలు ఉన్నాయన్నారు. మెడికల్, హెల్త్ విభాగాల వారు తగిన విద్ధంగా సన్నద్ధం కావాలన్నారు. ఆసుపత్రుల్లో వైద్యులు, ఔషధాలు, పడకలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ విభాగాలు తమ ఎక్విప్మెంట్ పనితీరు సరి చేసుకోవాలన్నారు. మొత్తం ప్రక్రియకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఓ నోడల్ సెంటర్‌గా ఉంటుందన్నారు. మొత్తం ప్రక్రియ కమాండ్ కంట్రోల్ సెంటర్ సీసీ కెమెరా దృశ్యాల ద్వారా మానిటరింగ్ జరుగుతుందన్నారు.
Also Read..
Errabelli | ప్రపంచ స్థాయిలో రాష్ట్రం పరువు తీసేలా సీఎం వ్యాఖ్యలు : ఎర్రబెల్లి
KCR | భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి భారతీయుడిగా గర్వపడుతున్నా : కేసీఆర్
Harish Rao | భారత్‌లో ఉగ్రవాదానికి స్థానం లేదు : హరీశ్‌రావు