Musi River | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ సుందరీకరణపై ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులూ జాగ్రత్త.. అత్యుత్సాహం ప్రదర్శించకండి అని ఆయన హెచ్చరించారు. అధికారులు మార్క్ చేసినంత మాత్రాన పేదల ఇండ్లు కూల్చలేరు అని మధుయాష్కీ స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని చైతన్యపురి, కొత్తపేట మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ భరోసా కల్పించారు.
మీ ఇంటిపై గడ్డపార పడదు.. మీ ఇంటిపైకి ప్రొక్లైన్ రాకుండా చూసుకుంటానని మూసీ బాధితులకు మధుయాష్కీ హామీ ఇచ్చారు. అధికారులు తమ ఆవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని సూచించారు. అక్రమార్కులైన అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మూసీ నదికి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ణయించేందుకు అధికారుల దగ్గర ఒక ప్రతిపాదిక లేదని స్పష్టం చేశారు.
నోటీసులు ఇవ్వకుండా, ప్రజల అంగీకారం లేకుండా ఏ ఇల్లు కూల్చకూడదని మధుయాష్కీ గౌడ్ తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం ఇండ్లు కూల్చాలి అంటే.. యూపీఏ హాయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువకు నాలుగింతల నష్టపరిహారం చెల్లించాల్సిందే. అయితే మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి సుందరీకరణ చేయొచ్చు. నదికి ఇండ్లు ఉన్న వైపు కాకుండా.. పొలాలు ఉన్న వైపు ఎక్కువ స్థలాన్ని సేకరించి కూడా సుందరీకరణ చేయొచ్చు అని మధుయాష్కీ గౌడ్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | వారి గూడును కూల్చేశారు.. వారి కలలను చిదిమేశారు.. కేటీఆర్ భావోద్వేగం.. వీడియో
Dasara Holidays | రేపట్నుంచి దసరా సెలవులు.. పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తప్పవు
Telangana | వరద ప్రభావిత రాష్ట్రాలకు నిధుల విడుదల.. తెలంగాణకు రూ. 416 కోట్లు మాత్రమే