CM Revanth Reddy | హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆవిష్కరించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది. అలాంటి చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టడమంటే ఆత్మగౌరవం మీద దాడిచేసినట్టేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్న విషయం విదితమే. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెడుతున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం ఉందని విగ్రహం పెడుతున్నారంటూ ప్రశ్నించారు. వందలమంది ప్రాణాలు తీసిన నాయకుడి విగ్రహం పెడతారా అంటూ కేటీఆర్ నిలదీశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ మనసు మార్చుకుని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము అధికారంలోకి వచ్చాక రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగించి.. తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్నారు. సకల మర్యాదలతో రాజీవ్‌గాంధీ విగ్రహం అక్కడి నుంచి తరలిస్తామని తెలిపారు.
అధికారంలో ఉన్నామని ఏదైనా చేస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం దారుణమని.. ఇప్పుడు విగ్రహం పెట్టినా అధికారంలో వచ్చాక దానిని వెంటనే తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. అంతే కాకుండా తెలంగాణలో రాజీవ్ పేరుతో ఉన్న రింగ్ రోడ్డు, హైదరాబాద్ విమానాశ్రయం సహా ఇతర సంస్థల పేర్లూ మారుస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఇందిరా, రాజీవ్ పేర్లతో హైదరాబాద్‌లో చాలానే ఉన్నాయని.. కాంగ్రెస్ ఇప్పటికైనా మారకుంటే అధికారంలోకి వచ్చాక అన్ని పేర్లు మారుస్తామని కేటీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Cellulitis | కరీంనగర్లో చర్మ వ్యాధి కలకలం.. విజృంభిస్తున్న సెల్యూలైటిస్..!
Telangana | వెల్లివిరిసిన మతసామరస్యం.. గణేష్ లడ్డు దక్కించుకున్న ముస్లిం సోదరుడు : వీడియో
Harish Rao | ప్రపంచంలోనే మన ఖైరతాబాద్ వినాయకుడు ఫేమస్ : హరీశ్‌రావు