భద్రాద్రి కొత్తగూడెం : గంగా యుమున తెహజీబ్కు ప్రతీక తెలంగాణ. వందల ఏండ్లుగా కులమతాలకు అతీతంగా ఈ గడ్డన శాంతి, సామరస్యంతో జీవిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. మతసామరస్యానికి పెట్టింది పేరు తెలంగాణ రాష్ట్రం. అందుకు ఎన్నో ఉదాహరణలు చరిత్ర పొడవునా కనిపిస్తాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మతసామరస్యం వెల్లివిరిసింది.
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా( Kothagudem district) అశ్వాపురం మండలం చవిటిగూడెంలో షేక్ అష్రఫ్ అనే ముస్లిం యువకుడు (Muslim youth) వేలంలో గణేశ్ లడ్డును(Ganesh laddu) దక్కించుకున్నాడు. అలాగే వరంగల్(Warangal) జిల్లా నర్సంపేట మండలం ముతోజీ పేటలో గణపతి ఉత్సవాలకు మహ్మద్ రియాజ్ అనే ముస్లిం సోదరుడు 216 కిలోల భారీ లడ్డును అందించి భక్తి భావాన్ని చాటుకున్నాడు.
వెల్లివిరిసిన మతసామరస్యం
గణేష్ లడ్డు దక్కించుకున్న ముస్లిం సోదరుడు
భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం చవిటిగూడెంలో షేక్ అష్రఫ్ అనే ముస్లిం యువకుడు వేలంలో గణేశ్ లడ్డూను దక్కించుకున్నారు.
అలాగే వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముతోజీ పేటలో గణపతి ఉత్సవాలకు మహ్మద్ రియాజ్ అనే ముస్లిం… pic.twitter.com/HPh3HPrTU4
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2024