నల్లగొండ : మిర్యాలగూడ(Miryalaguda) ఏరియా హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా బంధువులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డకు చెందిన ఓ యువతి(Young woman died )అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. నాగు అనే యువకుడు ప్రేమ పేరుతో హింసించి హత్య చేశాడని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని యువతి తల్లి దండ్రుల ఆరోపించారు.
నిందితుడుని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా బంధువులు అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనుమానస్పద స్థితిలో యువతి మృతి.. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత
నల్గొండ – దామరచర్ల మండలం పుట్టలగడ్డకు చెందిన ఓ యువతి అనుమానస్పద స్థితిలో మృతి.
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని యువతి తల్లిదండ్రుల ఆరోపణ.
మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్న బంధువులు.… pic.twitter.com/gbcfAazWyo
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2024