Megha Akash | టాలీవుడ్ భామ మేఘా ఆకాశ్ (Megha Akash) ఆగస్టులో తన ప్రియుడు సాయి విష్ణు (Saai Vishnu)తో నిశ్చితార్థం (engagement) పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. వెడ్డింగ్ గురించి ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఆసక్తికర వార్తను అందరితో పంచుకుంది మేఘా ఆకాశ్. సాయి విష్ణు- మేఘా ఆకాశ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
సంప్రదాయబద్దంగా ఈ ఇద్దరి వెడ్డింగ్ ఇవాళ చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, సన్నిహితులు, పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరై వధూవరులిద్దరినీ ఆశీర్వదించారు. సాయి విష్ణు పాపులర్ తమిళ పొలిటిషన్ తిరునవుకరసు కుమారుడు సాయి విష్ణు. ఈవెంట్‌కు ఎంకే స్టాలిన్, ఉదయనిధి, దురై మురుగన్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఆరేండ్లుగా ప్రేమలో ఉన్న మేఘా ఆకాశ్-సాయి విష్ణు ఫైనల్‌గా ఓ ఇంటివారు అయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో నూతన దంపతులకు అభిమానులు, నెటిజన్లు సోషల్‌మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మేఘా ఆకాశ్ ప్రస్తుతం వికటకవి, సహకుటుంబం సినిమాల్లో నటిస్తోంది. మరి వివాహం తర్వాత ప్రొఫెషనల్ లైఫ్‌ను కొనసాగిస్తుందా..? లేదా.,? అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
Actress #MeghaAkash marriage pic. Hearty wishes @akash_megha pic.twitter.com/6AdK99UTzs
— Sathish Kumar M (@sathishmsk) September 15, 2024
Mathu Vadalara 3 | త్రిబుల్ ఎంటర్టైన్ మెంట్.. మత్తు వదలరా 3 కూడా వచ్చేస్తుంది
SIIMA 2024 | సైమా 2024లో తెలుగు సినిమాల హవా.. అవార్డు విన్నర్ల జాబితా ఇదే
Chiranjeevi | End Titlesను కూడా వదలకుండా చూశా.. మత్తు వదలరా 2పై చిరంజీవి
Journey Re release | శర్వానంద్, అంజలి జర్నీ రీరిలీజ్‌కు రెడీ.. డేట్ ఎప్పుడంటే..?