Mathu Vadalara 2 | టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ చిత్రం ‘మత్తు వదలరా 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సత్య చేసిన కామెడీకి జనాలు విపరీతంగా క్యూ కడుతున్నారు. అయితే నాని నటించిన సరిపోదా శనివారం సినిమాలో సత్య రోల్‌ను పెట్టి డిలీట్ చేసినట్లు దర్శకుడు వివేక్ ఆత్రేయ తాజాగా వెల్లడించాడు. శనివారం ‘మత్తు వదలరా 2’ సక్సెస్ మీట్ జరుగగా.. ఈ వేడుకకు దర్శకుడు వివేక్ ఆత్రేయ వచ్చి మాట్లాడుతూ.. కామెడియన్ సత్య కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. అతడిని ఎవరు వద్దు అనుకోరు నా సినిమా సరిపోదా శనివారంలో కూడా సత్యను బ్రతిమాలి ఒక సీన్ సత్యతో చేయించాను. కానీ ఈ సీన్ మూవీలో ఉంచకుండా డిలీట్ చేశాను. ఇప్పుడు ఆ సీన్‌ను కూడా రిలీజ్ చేస్తాను. సత్య యాక్టింగ్ చూసి తమిళ దర్శకుడు, నటుడు ఎస్జే సూర్య వడివేలు లాగా ఉన్నాడు ఎవరు అతడు అన్నాడు. దానికి మించిన కాంప్లీమెంట్ లేదేమో అంటూ వివేక్ చెప్పుకోచ్చాడు.
నాని కథానాయకుడిగా వచ్చిన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). నాని 31గా వచ్చిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా.. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. తమిళ నటుడు ఎస్జే సూర్య కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రం ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.
Comedian Satya did a role in the #SaripodhaSanivaaram movie, but had to remove it from the movie, and will release that deleted video soon.
SJ Surya sir praised Satya comparing him with Vadivelu sir.
– Director Vivek Athreya at #MathuVadhalara2 success meet. pic.twitter.com/zpjdhjTukD
— Telugu Chitraalu (@TeluguChitraalu) September 14, 2024