Revanth Reddy | హైదరాబాద్ : హైదరాబాద్‌కు సముద్ర మార్గం లేదు.. మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్‌కు ఓడరేవు తీసుకొస్తానని మీ అందరి దగ్గర మనవి చేసుకుంటున్నానని ఓ సినిమాలో వినిపించిన డైలాగ్‌ను ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అక్షరాలా నిజం చేశారనిపిస్తోంది. వికారాబాద్‌లో వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రానికి శంకుస్థాపన సందర్భంగా.. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. హైదరాబాద్ నగరానికి, తెలంగాణకు మూడు వైపులా సముద్రం ఉన్నదని రేవంత్ వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ మేధావి లోకం, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్ నగరానికి, తెలంగాణకు మూడు వైపులా సముద్రం ఎక్కడుంది..? ఉంటే ఆ సముద్రాల పేర్లు ఏంటో చెప్పాలని రేవంత్ రెడ్డికి మేధావులు, నెటిజన్లు చురకలంటిస్తున్నారు. హుస్సేన్ సాగర్, గండిపేట్, హిమాయత్ సాగర్లను రేవంత్ రెడ్డి సముద్రం అనుకుంటున్నారేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రేవంత్ సముద్రం వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ రోజు దేశ రక్షణలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇంకొక్క కీలక అడుగు ముందుకు వేయబోతుంది. హైదరాబాద్ మొదటి నుంచి దేశ రక్షణ శాఖకు సంబంధించి డిఫెన్స్ కావొచ్చు.. ఆర్డినెన్స్ కావొచ్చు.. న్యూక్లియర్ ఫ్యూయల్స్ కావొచ్చు.. వీటితో పాటు దేశ రక్షణకు సంబంధించిన అనేక రకాల మిసైల్స్ తయారు చేసే అన్ని వ్యవస్థలో హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. ఈ విషయంలో హైదరాబాద్ పెద్ద ఎత్తున గుర్తింపు ఉంది. మన నగరానికి, మన రాష్ట్రానికి మూడు వైపులా సముద్రం ఉన్నది. బంగాళాఖాతం, అరేబియా మహా సముద్రం, హిందూ మహా సముద్రం.. ఇవన్నీ మన దేశం, మన ప్రాంతానికి అనుకుని ఉన్నాయి. సముద్రంలో ప్రయాణించే షిప్‌లను కానీ, మిగతా వ్యవస్థలను మానిటరింగ్ చేయడానికి ఈ రోజు అత్యంత స్ట్రాటజిక్ లోకేషన్‌ను వికారబాద్‌లో ఈ వీఎల్ఎఫ్ను ప్రారంభించుకోవడం జరిగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్‌కు, తెలంగాణకు మూడు వైపులా సముద్రం ఉన్నది – రేవంత్ రెడ్డి pic.twitter.com/vx7Gx9eQO5
— Telugu Scribe (@TeluguScribe) October 15, 2024
ఇవి కూడా చదవండి..
TG Rain Alert | అల్పపీడనం ప్రభావంతో.. తెలంగాణలో నాలుగు రోజుల వానగండం..!
Jagga Reddy | రాష్ట్ర పక్షి పాలపిట్టను బంధించిన జగ్గారెడ్డి.. వన్యప్రాణి సంరక్షకులు ఫైర్
MLA Rakesh Reddy | హిందువులు పిచ్చోళ్లు.. బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు