Telangana | హైదరాబాద్ : తెలంగాణలో సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించనున్నారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో రాష్ట్రంలో ప్రతిఒక్కరికి హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం క్షేత్రస్థాయి అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.
గోషామహల్లో నిర్మించ తలపెట్టిన కొత్త ఉస్మానియా ఆస్పత్రిపై సీఎం సమీక్షించారు. భూబదలాయింపు ప్రక్రియ, డిజైన్లు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 50 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రి నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ కనెక్టివిటీ ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌కు ఎమ్మెల్సీ కవిత
KTR | బండి సంజయ్‌పై చర్యలు తీసుకోండి.. సుప్రీంకోర్టుకు కేటీఆర్ రిక్వెస్ట్
MLC Kavitha | న్యాయమే గెలిచింది.. కవితకు బెయిల్ రావడంపై బీఆర్ఎస్ నేతల సంబురాలు