KTR | బండి సంజయ్‌పై చర్యలు తీసుకోండి.. సుప్రీంకోర్టుకు కేటీఆర్ రిక్వెస్ట్
KTR | ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సుప్రీంకోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా కామెంట్స్ చేసిన బండి సంజయ్ తీరును తప్పుబట్టారు.
KTR | ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సుప్రీంకోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా కామెంట్స్ చేసిన బండి సంజయ్ తీరును తప్పుబట్టారు.
ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలా విజయమంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ లాయర్ చేసిన కృషితో ఒకరికి బెయిల్ వస్తే… బీఆర్ఎస్ సపోర్ట్ కారణంగా ఒకరు రాజ్యసభలో స్థానం పొందారంటూ వివాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం తొలుత వాదనలు వినిపించిన లాయర్‌కు కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సీటు వచ్చేలా కేసీఆర్ రాజకీయ చతురత ప్రదర్శించారంటూ ఆయన చేసిన ట్వీట్ చేశారు. వైన్ అండ్ డైన్ క్రైమ్ లో పార్టనర్స్ అయిన కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు కంగ్రాట్యులేషన్స్ అంటూ ఆయన స్థాయిని మరిచి సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసేలా బండి సంజయ్ కామెంట్స్ చేశారు.
దీనిపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ సహాయశాఖ మంత్రిగా ఉన్న బండి సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని తెలిపారు. గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఇలా స్పందించడమేంటని నిలదీశారు. ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా తీసుకుని బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- bail
- Bandi Sanjay
- KTR
- Mlc Kavitha
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

