హైదరాబాద్ : చదువుల తల్లి, భారతదేశపు మెుట్టమెుదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే(Savitribai Phule)జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ఆ మహనీయురాలికి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో సావిత్రీ బాయి ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సామాజిక అసమానతలు, లింగ వివక్ష వంటి అనేక సామాజిక రుగ్మతలపై సావిత్రీబాయి పూలే అనేక పోరాటాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
సమాజ హితం కోసం ఆ మహనీయురాలు చేసిన సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. కాగా, మహిళలు, ఆడపిల్లల చదువు కోసం చేసిన విశేష సేవలకు గానూ ప్రతి ఏటా జనవరి 3న వారి సేవలు స్మరించుకుంటూ అధికారికంగా టీచర్స్ డే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
Cold Weather | రాష్ట్రంలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అత్యల్పంగా సిర్పూర్లో 6.5 డిగ్రీలు
KTR | ఆడబిడ్డల చదువుకై అక్షర సమరం చేసిన చదువుల తల్లి సావిత్రీబాయి: కేటీఆర్
RRR | పరిహారంపై పీటముడి.. ఆర్ఆర్ఆర్ భూసేకరణపై వీడని సందిగ్ధత!