Harish Rao | రేవంత్ రెడ్డి 31 నెలల్లో బూతులు తప్ప విషయం నేర్చుకోలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్దారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. మేడిగడ్డ గేట్లు మూసివేయకుండా కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఎలా ఆన్ చేస్తారు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేయవచ్చు అనే కనీస అవగాహన ముఖ్యమంత్రికి లేకపోవడం దౌర్భాగ్యమన్నారు.
రిటైర్డ్ ఇంజనీర్లు ఈ విషయం చెప్పిన తర్వాత కూడా రేవంత్ రెడ్డికి సోయి రాలేదని అన్నారు. ఉన్న విషయం బైటపెడితే రిటైర్డ్ ఇంజనీర్లను జైలులో వేస్తా.. లోపలేస్తా అని రేవంత్ రెడ్డి అంటుండు. నీకేం ప్రాబ్లమ్ అయితుంది..రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పినట్టు మోటార్లు ఆన్ చేసినా.. తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఇంజినీర్లు చెప్పినట్లు మోటార్లు ఆన్ చేసినా.. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ్ చేసినవి.. చెప్పినవి అబద్ధాలు, దుష్ప్రచారం బైట పడుతుందని నీళ్లు ఇవ్వకుండా అడ్డు పడుతున్నారన్నారు.
Live: తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మీడియా సమావేశంhttps://t.co/qNI2aApmmJ
— BRS Party (@BRSparty) July 12, 2026