Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో నాలుగు వారాలు పూర్తయ్యాయి. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా.. ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. సోమవారం జరిగిన నామినేషన్స్‌లో కంటెస్టెంట్ల మధ్య పాత గొడవలు మరోసారి తెరపైకి వచ్చాయి. పలు రౌండ్లుగా సాగిన నామినేషన్స్‌లో మాటల యుద్ధాలు, వాగ్వాదాలతో హౌస్ వేడెక్కింది. ఈసారి గుమ్మడికాయ టాస్క్ ద్వారా నామినేషన్స్ నిర్వహించారు. ఒక్కో కంటెస్టెంట్ గుమ్మడికాయను దాచగా.. ఇద్దరు కంటెస్టెంట్లు దాన్ని వెతకాల్సి వచ్చింది. విజేతకు ఇద్దరిని, ఓడిపోయిన వారికి ఒకరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. అయితే ఇమ్యూనిటీ సాధించిన సుధీర్, కెప్టెన్ అయిన వర్షిణిని నామినేట్ చేసే అవకాశం లేకుండా నిబంధనలు పెట్టారు.
తొలుత వర్షిణి గుమ్మడికాయను దాచగా రామ్ ప్రసాద్, ముకేష్ దాన్ని వెతికారు. ఇందులో రామ్ ప్రసాద్ విజేతగా నిలిచాడు. డాగర్ టాస్క్‌లో త్రిగుణ్ మెడను పట్టుకోలేదని చెప్పావు.. కానీ వీడియోలో చూస్తే పట్టుకున్నట్లు కనిపించిందంటూ అమన్‌ను రామ్ ప్రసాద్ నామినేట్ చేశాడు. ఆ తర్వాత రోహిత్ విషయంలో త్రిగుణ్ వ్యవహరించిన తీరు తనకు నచ్చలేదంటూ త్రిగుణ్‌ను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా త్రిగుణ్, రోహిత్ మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. తాను రోహిత్‌కు సారీ చెబుతున్నానని, తనను తాను డిఫెండ్ చేసుకోనని త్రిగుణ్ చెప్పాడు. అయితే రోహిత్ మాత్రం తాను క్షమించనని స్పష్టం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటలు తీవ్ర స్థాయికి వెళ్లాయి.
మరోవైపు ముకేష్.. అపూర్వను నామినేట్ చేశాడు. కెప్టెన్సీ సమయంలో ఆమె ప్రవర్తన తనకు నచ్చలేదని కారణం చెప్పాడు. దీంతో అపూర్వ, ముకేష్ మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, చిన్నది ఒకవైపు.. పెద్దది మరోవైపు అంటూ మాట్లాడటం సరైన పద్ధతి కాదని అపూర్వ అభ్యంతరం వ్యక్తం చేసింది. తర్వాత వంశీ గుమ్మడికాయను దాచగా అమన్, త్రిగుణ్ దాన్ని వెతికారు. ఇందులో త్రిగుణ్ విజేతగా నిలిచాడు. తనను రెచ్చగొట్టడం, బిగ్‌బాస్ నిబంధనలను ఉల్లంఘించడం, ఇక్కడి విషయాలను అక్కడ.. అక్కడి విషయాలను ఇక్కడ చెప్పడం తనకు నచ్చలేదంటూ అపూర్వను త్రిగుణ్ నామినేట్ చేశాడు. అనంతరం అమన్‌ను కూడా నామినేట్ చేశాడు.
అమన్ తన నామినేషన్‌కు ముకేష్‌ను ఎంచుకున్నాడు. ఒకరిని మోటివేట్ చేయడానికి మరొకరిని కించపరచడం, బచ్చాగాడు అంటూ మాట్లాడటం తనకు నచ్చలేదని కారణంగా చెప్పాడు. ఇక నరేశ్ గుమ్మడికాయను దాచగా షాలినీ, వర్షిణి దాన్ని వెతికారు. ఇందులో వర్షిణి విజేతగా నిలిచింది. వైల్డ్ కార్డుగా హౌస్‌లోకి వచ్చి పోస్టుకార్డులా మాత్రమే పనిచేస్తున్నావంటూ అపూర్వను నామినేట్ చేసింది. అనంతరం రోహిత్‌ను కూడా నామినేట్ చేసింది. షాలినీ సైతం త్రిగుణ్‌ను నామినేట్ చేసింది. త్రిగుణ్ తరచూ మాటలు జారుతున్నాడని, ఆ తర్వాత అదే విషయాలను నామినేషన్లో ఉపయోగిస్తున్నాడని ఆమె ఆరోపించింది.
మొత్తంగా ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియ హౌస్‌లో హీట్ పెంచింది. ఇప్పటివరకు జరిగిన పాత గొడవలను కంటెస్టెంట్లు మరోసారి ప్రస్తావించడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటికే త్రిగుణ్–రోహిత్, ముకేష్–అపూర్వ మధ్య వాగ్వాదాలు హాట్ టాపిక్‌గా మారగా.. తదుపరి ఎపిసోడ్లో రోహిత్, సుధీర్ మధ్య కూడా గొడవ జరగనున్నట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది. దీంతో ఐదో వారం బిగ్‌బాస్ హౌస్‌లో మరిన్ని వివాదాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.